Baba Vanga: బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పినట్టే 2024లో కూడా జరగబోతోందా..? ప్రపంచంలో జనానికి కష్టాలు తప్పవా.. మొత్తం పవర్ గ్రిడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్.. అన్నీ కుప్పకూలిపోతాయా.. అలాగైతే ప్రపంచమంతా చీకట్లు.. తాగడానికి నీళ్ళు కూడా దొరక్క అల్లాడిపోతారా..? గతంలో బాబా చెప్పినట్టే జరిగాయి. ఇప్పుడు ఎందుకు జరగవ్.. అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
మోడర్న్ నోస్ట్రాడమస్‌గా పిలిచే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా గతంలో చెప్పినవన్నీ జరిగాయి. ఆయన భవిష్యవాణి అక్షరాల కరెక్ట్ అయింది. ట్విన్ టవర్ ఎటాక్స్, ప్రిన్సెస్ డయానా మృతి, చర్నోబిల్ రియాక్టర్ లీక్స్, బ్రెగ్జిట్ వ్యవహారం.. ఇలా చాలా వరకూ వంగా చెప్పినవన్నీ నిజం అయ్యాయి. అయితే సడన్‌గా ఇప్పుడు వంగా మీద సోషల్ మీడియాలో డిస్కషన్ ఎందుకు మొదలైంది అంటే.. ఈ ఏడాదిలో క్యాన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ వస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనే ఇందుక్కారణం. బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ నాలుగో స్థానానికి పడిపోవడం లాంటి అంశాలు కూడా బాబా వంగా 2024 ప్రిడిక్షన్స్‌లో ఉన్నాయని నెటిజన్స్ చెబుతున్నారు.
PAWAN KALYAN: ఓజీ తుపాన్.. ముంబై హార్బర్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్
2024లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరుగుతుంది. యూరప్ దేశాలపై ఉగ్రవాదులు భీకరంగా దాడులు చేస్తారు. ప్రపంచంలో తన ఉనికి చాటుకోడానికి ఓ దేశం.. జీవాయుధాలను పరీక్షిస్తుంది. వాటితో దాడులు కూడా చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు వస్తాయని 2024 భవిష్యవాణిలో వంగా బాబు చెప్పారు. ఇక వీటిన్నింటికంటే ముఖ్యంగా సైబర్ ఎటాక్స్‌పై భయంకర ప్రిడిక్షన్స్ చేశారు. పవర్ గ్రిడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, దేశాల భద్రతే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతాయని తెలిపారు. అంటే ప్రపంచంలో చాలా దేశాలు చీకట్లు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు తాగునీటికి కూడా జనం కటకటలాడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో సైబర్ క్రిమినల్స్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే క్యాంటమ్ కంప్యూటింగ్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని కూడా వంగా బాబా ప్రిడిక్ట్ చేశారు.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. సో.. ఈ రంగం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిలో కూడా వంగా బాబా ప్రిడక్షన్స్ అన్నీ కరెక్ట్ అవుతాయా.. అయితే మాత్రం 2024లో ప్రపంచంలో ఊహించని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నెటిజెన్స్.