Bharat Rice: మార్కెట్లోకి భారత్ రైస్.. కిలో 25 రూపాయలే !

ప్రజలకు చవకగా బియ్యం అందించాలని భావిస్తోంది. ఇప్పటికే భారత్ ఆట్టా, భారత్ దాల్ పేరుతో తక్కువ ధరకే గోధుమ పిండి, పప్పుల్ని అందిస్తోంది. రాయితీ కింద కిలో గోధుమలను రూ.27.50కి, పప్పులను రూ.60 చొప్పున విక్రయిస్తోంది.

  • Written By:
  • Updated On - December 27, 2023 / 04:01 PM IST

Bharat Rice: దేశవ్యాప్తంగా పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బియ్యం ధరల్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గతంలో బియ్యం ఎగుమతిని కూడా నిలిపివేసింది. ఇప్పుడు కొత్తగా భారత్ రైస్‌ను అందుబాటులోకి తేనుంది. కిలో రూ.25 చొప్పున వీటిని విక్రయించనుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగత తెలిసిందే. ఈలోగా బియ్యం ధరలు పెరిగితే, అది ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేందుకు దారితీయొచ్చు.

REVANTH REDDY: కేటీఆర్, హరీష్ అవినీతి సొమ్ము కక్కిస్తాం: సీఎం రేవంత్

అందుకే ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు చవకగా బియ్యం అందించాలని భావిస్తోంది. ఇప్పటికే భారత్ ఆట్టా, భారత్ దాల్ పేరుతో తక్కువ ధరకే గోధుమ పిండి, పప్పుల్ని అందిస్తోంది. రాయితీ కింద కిలో గోధుమలను రూ.27.50కి, పప్పులను రూ.60 చొప్పున విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల రిటైల్ పాయింట్స్ వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు భారత్ రైస్ తీసుకురావాలని భావిస్తోంది. వీటిని కేంద్రీయ భండార్ ఔట్‌లెట్స్, మొబైల్ వ్యాన్స్‌తోపాటు నేషనల్ అగ్రికలచ్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి రాయితీతో అందించనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ బియ్యం ధర రూ.43 దాటింది. గతేడాదితో పోలిస్తే ఇది 14.1 శాతం ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ అధికారి తెలిపారు. బియ్యం ధరలు కొద్ది రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి.

గత నవంబర్‌లోనే బియ్యం ధర 10.3 శాతం పెరిగింది. దీంతో ఆహార ద్రవ్యోల్బణం కూడా 8.7 శాతం పెరిగింది. అందుకే సామాన్యుడికి ఊరట కలిగిస్తూ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు బియ్యం అందుబాటు ధరలో ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.