తాను పెంచుకుంటున్న రెండు ఏనుగులకు తన యావదాస్తి 5 కోట్లు రాసిచ్చాడు. చాలా ఏళ్లుగా అక్తర్ ఈ ఏనుగులను పెంచుకుంటున్నాడు. వాటికి ప్రేమగా మోతి, రాణి అని పేర్లు పెట్టుకున్నాడు. ఫ్యామిలీ గొడవల కారణంగా చాలా ఏళ్ల క్రితం కుటుంబానికి దూరమయ్యాడు అక్తర్. అప్పటి నుంచి ఈ రెండు ఏనుగులే అతని కుటుంబ సభ్యులు. అందుకే తన నదనంతరం ఆస్తి మొత్తం వాటికే దక్కాలని నిర్ణయించుకున్నాడు. ఆస్తి మొత్తం ఏనుగులకు చెందేలా వీలునామా రాశాడు. కానీ అక్తర్ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే రాణి అనే ఏనుగు చనిపోయింది. దీంతో ఆస్తి మొత్తానికి మోతి మాత్రమే ఇప్పుడు వారసురాలు.
2021లో అక్తర్‌ను ఎవరో చంపేశారు. ఆస్తి మొత్తం ఏనుగుల పేరు మీద రాయడంతో కుటుంబ సభ్యులే అక్తర్‌ను చంపేశారని అక్కడంతా చెప్పుకుంటారు. అక్తర్ బతికున్నప్పుడు రాసిన వీలునామా ప్రకారం ఆయన ఆస్తి మొత్తం ఇప్పుడు మోతికి చెందింది. అక్తర్ చనిపోయిన తరువాత ఫారెస్ట్ అధికారులు మోతిని ఉత్తరాఖండ్‌కు తరలించారు. ప్రస్తుతం రామ్‌నగర్‌లో ఓ వ్యక్తి సంరక్షణలో ఉంది మోతి. కానీ అక్తర్ ఆస్తి మొత్తం పాట్నాలో ఉంది. ఏనుగు సంరక్షణకు ఆస్తిని సద్వినియోగం చేస్తేనే అక్తర్ ఆఖరి కోరిక తీరుతుంది. ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు అక్కడి ఫారెస్ట్ అధికారులు. కానీ ఆస్తిని ఏనుగుకు ఉపయోగించేందుకు అక్తర్ కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఆస్తిని మోతికి దక్కించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారో చూడాలి.