హైదరాబాద్ లో బిర్యానీలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. ఫెస్టివల్స్, ఫంక్షన్లు, న్యూఇయర్, వీకెండ్స్, వీక్ డేస్ అనేది తేడా లేకుండా…. జనం బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో… ఎందులో దొరికితే అందులో ఆర్డర్స్ ఇస్తున్నారు. హోటళ్ళు, రెస్టారెంట్స్ లోనూ…. 365 రోజులూ బిర్యానీలకి ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. గతంలో క్రిస్మస్, కొత్త ఏడాది వచ్చాయంటే చాలు … చాలామంది కేక్స్ కట్ చేసేవారు. అందుకే బేకరీలు, స్వీట్ షాపుల యజమానులు… వారం ముందు నుంచే కేక్స్ ఆర్డర్స్ తీసుకునేవారు. క్రిస్మస్ నుంచి షాపుల ముందే ప్రత్యేక టెంట్లు వేసి… న్యూఇయర్ రోజు వరకూ కేక్స్ అమ్మేవారు. ముందుగా ఆర్డర్ ఇవ్వకపోతే కేక్స్ దొరికేవి కూడా కాదు.
కానీ ఇప్పుడు హైదరాబాద్ లో… కేక్స్ కి బదులు బిర్యానీల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈసారి న్యూఇయర్ కి రికార్డు స్థాయిలో బిర్యానీ పార్శిల్స్ అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 తేదీ దాకా ఇదే పరిస్థితి కంటిన్యూ అవ్వొచ్చని చెబుతున్నారు. గత ఏడాది నుంచే బిర్యానీ కల్చర్ బాగా పెరిగిపోయిందని రెస్టారెంట్ల నిర్వాహకులు అంటున్నారు. అప్పుడు కూడా హాటళ్ళ ముందు బిర్యానీల కోసం జనం ఎగబడిన సంఘనలు అనేకం జరిగాయి. ఒకానొక దశలో డిమాండ్ కు తగ్గట్టుగా బిర్యానీని సప్లయ్ చేయలేక హోటళ్ళు కూడా మూసుకోవాల్సి వచ్చింది. ఓ ప్రముఖ రెస్టారెంట్ అయితే గత ఏడాది 15 వేల కిలోల మాంసాన్ని వండించింది. అయినా సరిపోకపోవడంతో… నో స్టాక్ బోర్డు పెట్టుకుంది.
ఇప్పుడు న్యూఇయర్ కోసం ఆదివారం నాడు ప్రముఖ రెస్టారెంట్స్ ప్రత్యేకంగా రోడ్ సైడ్ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో బిర్యానీలకు ఎక్కువగా డిమాండ్ ఉండే… అమీర్ పేట, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నానక్ రామ్ గూడ ఏరియాల్లో తాత్కాలికంగా టెంట్లు ఏర్పాటు చేసి… బిర్యానీల అమ్మకాలు చేస్తున్నారు. ఆర్డర్స్ రాగానే అప్పటికప్పుడు వేడి వేడిగా చికెన్, మటన్ బిర్యానీలను ప్యాక్ చేసి పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాయి ప్రముఖ రెస్టారెంట్లు. ఈ రెండు రోజుల కోసం రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ సంస్థలు … తాము రోజూ తయారు చేసే దానికన్నా ఐదు రెట్లు బిర్యానీలు వండటానికి సిద్ధంగా ఉన్నాయి. సో… 2024 న్యూ ఇయర్ కి హైదరాబాద్ బిర్యానీలు ఏ స్థాయిలో అమ్ముడుపోతాయో…. దేశంలోనే రికార్డులు సృష్టిస్తాయేమో చూడాలి. ఇంతకూ… మీరు ఆర్డర్ చేశారా… వెంటనే చేసేయండి… స్టాక్ అయిపోతుందేమో.