Mini PC: అరచేతి పరిమాణంలో మల్టీపర్పస్ కంప్యూటర్..!

ఒకప్పుడు చార్లెస్ బ్యాబెజ్ కంప్యూటర్లను కనుగొన్నప్పుడు పెద్దహాలు పరిమాణంలో ఉండేది అని విన్నాం. క్రమక్రమంగా దాని విస్తృతి పెంచుకుంటూ చిన్నసైజులోకి మారిపోయింది. ఒక చిన్న స్టూల్ పై పెట్టుకొని పని చేసేంతగా మారిపోయింది. కానీ ఇప్పడు మరింత చిన్న మరిమాణంలో పర్సనల్ పీసీ పేరుతో అరచేతిలోకి వచ్చేసింది. కేవలం రెండు వేళ్లతో పట్టుకునేలా సరికొత్త రూపాన్ని.. వింతైన ఆకృతిని అలంకరించుకుంది.

  • Written By:
  • Publish Date - February 26, 2023 / 01:02 PM IST

ప్రస్తుత కాలంలో కంప్యూటర్ అంటే తెలియని వారు ఎవరూ లేరు. చిన్న పిల్లలకు పాఠశాలలో చేరిపించే వయసు నుంచే ఇది పరిపాటిగా మారిపోయింది. ఈ-టెక్నో పేరుతో బాల్యంలోనే వీడియో గేమ్స్ ఆడిస్తూ గణనయంత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. పెద్దవారు సైతం ఈ కంప్యూటర్ కు దాసోహం అయిపోతున్నారు. నేటి సమాజంలో ఏ ఆఫీసులో చూసినా టేబుల్ పై నల్లని మానిటర్ దర్శనమిస్తుంది. దీనిని బట్టి అర్థమైందేమిటంటే పసిపిల్లాడి నుంచి రేపో మాపో రిటైర్డ్ అయ్యే సీనియర్ సిటిజన్ వరకూ ప్రతిఒక్కరికీ దీని వినియోగం అధికమైపోయింది.

అందరికీ వీలుగా
టెక్నాలజీ అనేది నిత్యోదయ సూర్యకిరణం లాంటిది. ఈరోజు సాయంత్రం అస్తమించినప్పటికీ రేపు సరికొత్త కిరణతేజంతో ప్రకాశిస్తుంది. ఒకప్పుడు కంప్యూటర్లు అంటే పెద్ద సెటప్ ఉంటుంది. మానిటర్ నుంచి కీబోర్డు వరకూ.. సీపీయూ నుంచి మౌస్ వరకూ ఒక ప్రదేశంలో అమర్చవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పే కంప్యూటర్ చాలా చిన్నది. దీనిని ఎంటర్టైన్మెంట్, ఎడ్యూకేషన్, గేమ్స్, మల్టీమీడియా, ఆఫీస్ పనులకు ఉపయోగించుకునేందుకు వీలుగా తయారు చేశామని చెబుతున్నారు.

SMART COMPUTER

మినీ పీసీ ఫీచర్లు
గతంలో 5-10 కిలోల బరువు ఉంటే ఇప్పుడు చెప్పే కంప్యూటర్ 150గ్రాముల బరువు ఉంటుంది. దీని బాక్స్ ప్యాకింగ్ స్మార్ట్ ఫోన్ అంత ఉంటుంది. అమెరికన్ కంపెనీ ఫ్యూజన్5 ఎఫ్ఎంపీ4 బ్రాండ్ పేరుతో మైక్రో పర్సనల్ పీసీని తయారుచేసింది. ఇది విండోస్ 10, 11 తో పాటూ లినుక్స్ ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తుంది. ఈ మినీ కంప్యూటర్ 8GB DDR4 RAM/256GB SSDతో పనిచేస్తుంది. ఇందులో రెండు HDMIతోపాటూ మూడు USB పోర్టర్స్ ఏర్పాటు చేశారు. ఇంటెల్ ప్రాసెసర్ తోపాటూ డ్యూయల్ బాండ్ వైఫై కనెక్టివిటీ ఉంది. వీటితోపాటూ మైక్, హెడ్ సెట్ రెండింటికి సంబంధించిన జాక్, మైక్రో SDకార్డ్ స్లాట్ ఉన్నాయి. డిస్ ప్లే విషయానికి వస్తే దీని పొడవు, వెడల్పులు 7 సెంటీమీటర్లు కాగా దీని ఎత్తు 4 సెంటీమీటర్లు ఉండేలా చిన్న పరిమాణంలో తయారు చేశారు.

 

 

 

T.V.SRIKAR