Caucasian Shepherd Dog: ఈ శునకం ఖరీదు రూ.20 కోట్లు.. హైదరాబాదీలను ఆకట్టుకుంటున్న డాగ్

బెంగుళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ ఖరీదైన శునకాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న డాగ్ షో కోసం ఈ శునకాన్ని తీసుకొచ్చినట్లు సతీష్ చెప్పారు.

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 04:27 PM IST

Caucasian Shepherd Dog: సాధారణంగా పెంపుడు కుక్కలు వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటాయని తెలుసు. కానీ, ఓ శునకం ఖరీదు ఏకంగా రూ.20 కోట్లు ఉంది. శునకానికి ఇంత ఖరీదా అనుకుంటున్నారా..? ఎందుకంటే ఈ శునకం కాకసియాన్ షెఫర్డ్ అనే అరుదైన జాతికి చెందినది. రష్యన్ బ్రీడ్. అయితే, ఈ కుక్క ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేసింది. మియాపూర్‌, మదీనాగూడలోని ఒక పెట్ క్లినిక్‌‌కు వచ్చింది.

Apple iPhones: యాపిల్ యూజర్లూ జాగ్రత్త.. ఐఫోన్లలో సెక్యూరిటీ లోపాలు..

బెంగుళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ ఖరీదైన శునకాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న డాగ్ షో కోసం ఈ శునకాన్ని తీసుకొచ్చినట్లు సతీష్ చెప్పారు. ఈ శునకానికి కాడాబామ్ హైడర్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. రష్యా బ్రీడ్‌కు చెందిన అరుదైన శునకాన్ని రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇది అరుదైన జాతికి చెందినది కావడం వల్లే దీనికి ఇంత ధర ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ శునకం వయసు మూడు సంవత్సరాలు. మాంసాహారాన్ని ఇష్టంగా తింటుంది. రోజూ మూడు కిలోల చికెన్ తింటుందని తెలిపారు. ఈ శునకం ప్రపంచవ్యాప్తంగా అనేక డాగ్ షోలలో పాల్గొందని, అంతర్జాతీయంగా 32 అవార్డులు గెలుచుకుందన్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించిందని వెల్లడించారు. వచ్చే నెలలో ఈ శునకంతో బెంగళూరులో స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

150 బైకులతో, రష్యాకు చెందిన సినిమా తారలతో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అరుదైన శునకం కావడంతో మియాపూర్‌లో క్లినిక్‌లో ఈ శునకంతో ఫొటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. సతీష్ గతంలో కూడా కోట్ల రూపాయల విలువైన అరుదైన శునకాల్ని కూడా పెంచుకున్నాడు. ఇప్పటికే ఆయన దగ్గర రూ.10 కోట్లు విలువ చేసే మస్తిఫ్ జాతి శునకం రూ.8 కోట్ల విలువ చేసే అలస్కన్ మాలామ్యూట్ శునకం, రూ.కోటి విలువ చేసే కొరియన్ డోసా మస్తిఫ్ సహా వివిధ జాతి శునకాలున్నాయి. వాటిని తాము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. తన ఇంట్లో వాటి నిర్వహణకే ప్రతి నెలా రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు.