కలకత్తా డాక్టర్ అభయ రేప్ అండ్ మర్డర్ కేసులో బయటికి వచ్చిన సీసీ ఫుటేజ్ ఈ కేసుకు పెద్ద బ్రేక్ త్రూ అనే చెప్పాలి. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గరి నుంచి సంజయ్ రాయ్ అన్నీ పొంతన లేని సమాధానాలే చెప్తున్నాడు. ఒకసారి తాను ఈ రేప్ చేయలేదు అని చెప్పి మరోసారి మీరు ఏ శిక్ష ఐనా వేసుకోండి అని పోలీసులనే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఐతే ఈ సీసీ ఫుటేజ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో.. అప్పుడే ఈ కేసులో క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఫుటేజ్ చాలా క్లియర్‌గా చూడొచ్చు. సంజయ్ రాయ్ మూడో ఫ్లోర్‌లో కాన్ఫరెన్స్ హాల్ దిక్కు వెళ్తున్నప్పుడు అతని మెడలో ఉన్న బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ తిరిగి బయటికి వచ్చేటప్పు మాత్రం అతని దగ్గర లేవు. ఆ హెడ్‌ఫోన్స్‌ను క్రైమ్ సీన్‌లో అభయ డెడ్‌బాడీ దగ్గర రికవరీ చేసుకున్నారు పోలీసులు. దాదాపు 4 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ హాస్పిటల్‌కు వచ్చాడు. సీసీ ఫుటేజ్‌లో అతను క్లియర్‌గా రికార్డ్ అయ్యాడు. సంజయ్ వచ్చిన టైంలో ఆర్జీకార్ మెడికల్ హాస్పిటల్‌లోని మూడో ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అభయ నిద్రపోతోంది. దాదాపు 36 గంటల డ్యూటీ తరువాత అభయ, తనతో పాటు మరో ఇద్దరు డాక్టర్లు కూడా అదే రూంలో రెస్ట్ తీసుకోవాలి అనుకున్నారు. కానీ లాస్ట్ మినట్‌లో ఆ ఇద్దరు డాక్టర్లకు వేరే డ్యూటీ ఉండటం.. మధ్యలోనే వెళ్లాల్సి రావడంతో వాళ్లు వేరే రూంకు వెళ్లిపోయారు. అప్పటికే చాలా అలసిపోయిన అభయ కాన్ఫరెన్స్ రూంకు వెళ్లి నిద్రపోయింది. 36 గంటలు కంటిన్యూగా పని చేయడంతో చాలా అలసపోయింది. అదే టైంలో సంజయ్ మూడో ఫ్లోర్‌లోకి వచ్చాడు. అభయ ఉన్న రూంలోకి వెళ్లడం కంటే ముందు ఆ ఫ్లోర్‌లో ఉన్న చాలా రూమ్స్‌ను సంజయ్ వెతికాడు తన కోరిక తీర్చుకునేందుకు ఎవరైనా అమ్మాయి దొరుకుందా అని. అలాగే వెతుకుతూ వెళ్తున్న సంజయ్‌కి కాన్ఫరెన్స్ రూంలో అభయ నిద్రపోతూ కనిపించింది. వెంటనే లోపలికి వెళ్లి డోర్లు లాక్ చేశాడు సంజయ్. అప్పటికే అలసిపోయి ఉన్న అభయ గొంతు నొక్కి కదల కుండా చేశాడు. సంజయ్ ఒక ట్రైన్డ్ బాక్సర్ కావడంతో భయత తనను డిఫెండ్ చేయలేకపోయింది. ఆ కిరాతకుడి చేతిలో చనిపోయింది. అయితే అభయను రేప్ చేశాక చంపేశాడా లేక చంపేసి రేప్ చేశాడా అనే విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఈ మొత్తం వ్యవహారం అంతా కేవలం 32 నిమిషాల్లోనే జరిగింది. సరిగ్గా మళ్లీ 4 గంటల 32 నిమిషాలకు ఆర్జీకార్ ఎగ్జిట్ డోర్ దగ్గర సీసీ టీవీలో సంజయ్ రాయ్ కనిపించాడు అతను మళ్లీ కనిపించ టైంలో అతని మెడలో బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ లేవు. ఇద ఈ కేసులో పోలీసులకు దొరికిన పెద్ద ఎవిడెన్స్. దీంతో మొత్తం క్రైంసీన్ అంతా ఇప్పుడు బయటికి రాబోతోంది. అదే రోజు రాత్రి ఇన్సిడెంట్ జరగడానికి ముందు అభయతో ఉన్న ముగ్గురు మెడికోలు కూడా ఇప్పుడు సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. వాళ్లను కూడా సీబీఐ లై డిటెక్టర్‌తో టెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్లు అదే ఫ్లోర్‌లో వేరే రూమ్‌లో ఉన్నారు. కానీ అభయ అరుపులు గానీ ఎలాంటి శబ్ధాలు గానీ వాళ్లకు వినిపించలేదని చెప్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన రూం సౌండ్ ప్రూఫ్ రూం కావడంతో ఎలాంటి సౌండ్స్ బయటికి రాలేదని చెప్తున్నారు. వాళ్లు చెప్పేదాంట్లో లాజిక్ ఉన్నప్పటికీ ప్రతీ విషయాన్ని చాలా కీన్‌గా ఇన్వెస్టిగేట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. సంజయ్ రాయ్ తరువాత ఈ కేసులో కాలేజీ ప్రిన్సిపన్ సందీప్ ఘోష్ మెయిన్ అక్యూస్డ్‌గా ఉన్నాడు. ఎందుకంటూ ఇన్సిడెంట్ జరిగిన తరువాత దీన్ని సూసైడ్‌గా క్రియేట్ చేసేందుకు సందీప్ ప్రయత్నించాడు.. దాంతో పాటు క్రై జరిగిన దాదాపు 3 గంటల తరువాత అభయ పేరెంట్స్‌కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్లు వచ్చాక కూడా చాలా గంటల సేపు వాళ్లను బాడీ దగ్గరకు వెళ్లనివ్వలేదు. దీంతో ఇప్పుడు సందీన్ కూడా లై డిటెక్టర్‌తో ప్రశ్నించేందుకు సీబీఐ రెడీ అయ్యింది. ఈ పాలీగ్రాఫ్‌కు ఒకే చెప్తూనే నిందితుడి సంజయ్ రాయ్ జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని.. పాలీగ్రాఫ్ టెస్ట్‌లో నిజాలు బయటికి వస్తాయంటూ ఏడ్చాడు. సో ఓవరాల్‌గా ఈ లై డిటెక్టర్ టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్‌ల తరువాత క్రైం గురించి పూర్తి వివరాలు బయటికి రాబోతున్నాయి.