Chaddi Annam: చద్దన్నం అనగానే అందరూ తేలిగ్గా తీసిపడేస్తారు. తినడానికి అస్సలు ఆసక్తి చూపరు. కానీ, దీన్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా తింటారు. అన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే.. ఈ చద్దన్నాన్ని స్టార్ హోటల్స్‌లో కూడా అందిస్తున్నారు. అమెరికాలోనూ ఇప్పుడు చద్దన్నం అమ్ముతున్నారు. ఔను.. అమెరికాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో సద్ది అన్నం, ఫెర్మెంటెడ్ రైస్ పేరుతో చద్దన్నాన్ని అందుబాటులో ఉంచారు.
MAKARA JYOTHI: అయ్యప్ప భక్తులకు షాకింగ్ న్యూస్ ! జ్యోతి దర్శనానికి 50వేల మందికే పర్మిషన్
తాజాగా అమెరికాలోని ఒక ఫుడ్ స్టోర్‌లో చద్దన్నం అమ్ముతుండగా.. ఒక తెలుగు ఎన్‌ఆఆర్‌ఐ మహిళ దానికి సంబంధించిన వీడియో తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫుడ్ స్టోర్‌లో సద్ది అన్నాన్ని 13 డాలర్లకు అమ్ముతున్నట్లు ఆ మహిళ తెలిపింది. అంటే.. మన కరెన్సీలో దాదాపు వెయ్యి రూపాయలకు పైగానే దీని ధర. గుప్పెడంత అన్నానికి ఇంత ధరా అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. మన చద్దన్నాన్ని అమెరికాలో అమ్ముతుండటం గొప్ప విషయమే అయినా.. దాని ధర మాత్రం షాకిస్తోంది. చద్దన్నానికి వెయ్యి రూపాయలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రాత్రి వండగా, మిగిలిన అన్నంలో పెరుగు కలిపి ఉదమయే, ఉల్లిపాయ, ఆవకాయతో తింటే అదే చద్దన్నం. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. దీనిలో పోషకాలు ఎక్కువ. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఇటీవలి కాలంలో కొందరు రెగ్యులర్ టిఫిన్స్ బదులు.. చద్దన్నాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. అమెరికాలో వేయి రూపాయలు పెట్టి తింటున్న చద్దన్నాన్ని మనింట్లోనే చక్కగా తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. మీరేమంటారు..!