కేదార్నాథ్ క్షేత్రం (Kedarnath Temple ).. హిందువులకు కాశీ (Kashi) తర్వాత.. అతి ఒక్కసారైనా వెళ్లాలని అనుకున్న ఆధ్యాత్మిక.. పర్యటక ప్రాంతం కేధార్ నాథ్ యాత్ర.. భారతదేశంలోని హిమాలయ శ్రేణిలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో.. దేవ ప్రయాగ, రుద్ర ప్రయాగ, విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ వంటి ఐదు పవిత్ర నదీ సంగమాలను దాటి భూమి నుంచి 26 కిలోమీటర్ల కాలినడక (ట్రెక్కింగ్) తో హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ ఆలయంకు చేరుకోవాలి.
కేధార్ నాథ్ ఆలయం భారత దేశంలో ఉన్న జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన ఈ ఆలయాన్ని కూడా ఒకటి. కాగా ఈ సంవత్సరం కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులను భారత ఆర్మీ ఆర్వర్యంలో తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ (Ajendra Ajay) తెలిపారు. చార్‌థామ్ (Char Dham Yatra) యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు. మహాశివరాత్రి (Mahashivratri) పర్వదినం సందర్భంగా ఆలయ ద్వారాల ఓపెనింగ్‌కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు.
చోట చార్ ధార్ యాత్రలో మూడవ దేవాలయం.. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం అతి ప్రధానమైన ఆలయం. ప్రతి ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని వస్తుంటారు. కాగా ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. ఈ ఆలయం కు వచ్చే భక్తులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా పర్యటకు సైతం ఈ యాత్ర చేయడం విశేషం.. ప్రతియేటా చార్ధామ్ యాత్రకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. 2022లో ఈ సంఖ్య 4.6 మిలియన్గా వచ్చి ఆలయ చరిత్రలో ఒక రికార్డుగా నమైదైంది.. 2023లో గత సంవత్సరం ఆ రికార్డును పటాపంచలు చేసి.. 5.6 మిలియన్ల మంది అక్కడికి వెళ్లారు.. ఇక సారి కూడా ముచ్చటగా మూడో సారి కూడా గత సంవత్సరం రికార్డును బ్రేక్ చేస్తుందని ఉత్తరాఖండ్ దేవదాయ శాఖ వెల్లడించింది.
ఈ యాత్ర చెయ్యాలంటే పూర్తిగా మూడు మార్గాలు ఉన్నాయి.
కేదార్నాథ్ యాత్ర తో పాటుగా చోట చార్ ధామ్ యాత్రలోని మిగతా మూడు ఆలయాలు కూడా ఈ నెలలోనే తెరవనున్నారు.
Suresh SSM