నిన్నటి వరకూ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చిన చాట్ జీపీటీ.. ఇప్పుడు యూజర్లకు డబ్బులు కూడా ఇస్తోంది. తనకు డబ్బులు కావాలంటూ అడిగిన ఓ యూజర్‌కు 210 డాలర్లు వచ్చేలా చేసింది. అమెరికాలో ఉండే జోషువా బ్రౌడర్ తనకు డబ్బులు కావాలంటూ చాట్ జీపీటీని అడిగాడు. తన పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ డిటెయిల్స్ అన్నీ చాట్ జీపీటీకి ఇచ్చాడు. వెంటనే జోషువా బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న క్యాష్ బ్యాక్, అన్‌క్లైమ్డ్ రివార్డ్స్ డిటెయిల్స్ బయట పెట్టింది చాట్ జీపీటీ.
ఆ రివార్డ్స్, క్యాష్‌బ్యాక్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ డిటెయిల్స్ ఇచ్చింది. ఆ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేయగానే వెంటనే బ్యాంక్ నుంచి 210 డాలర్లు జోషువా బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయి. ఇండియన్ కరెన్సీలో దాదాపు 17 వేలు. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు జోషువా బ్రౌడర్. చాట్ జీపీటీ తనకు అడగగానే డబ్బులిచ్చిందంటూ పోస్ట్ పెట్టారు. జోషువా పోస్ట్ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇప్పటి వరకూ కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చిన చాట్ జీపీటీ డబ్బులు కూడా వచ్చేలా చేస్తుందా అంటూ నెటిజన్స్ షాకవుతున్నారు. తమ అకౌంట్స్‌లో కూడా క్లైమ్ చేసుకోని రివార్డ్స్ చెక్ చేసుకుంటున్నారు. చాట్ జీపీటీ హెల్ప్‌తో మేము కూడా క్లెయిమ్స్ తెచ్చుకుంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు డబ్బు కావాలి అంటే చాట్ జీపీటీ ఏం చెప్తుందో మీరు కూడా ఓ సారి చెక్ చేసుకోండి.