iPhones: నార్మల్‌గా చైనా ఎలక్ట్రానిక్స్ వాడాలి అంటే వేరే దేశాలు వెనకాడుతుంటాయి. ఎక్కడ దొంగదారిలో డేటా సేకరిస్తారో అని భయం. అమెరికా, ఇండియా సహా కొన్ని దేశాలు కొన్ని చైనా ప్రోడక్ట్స్‌ని చాలా వరకు బ్యాన్ చేశాయి కూడా. ఇప్పుడు చైనాకు కూడా ఇదే భయం పట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు వాడొద్దంటూ చైనా ఆర్డర్స్ పాస్ చేసింది. ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని తమ ఉద్యోగులకు సూచించిందట. అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని పబ్లిష్ చేసింది.
చైనా కొన్నేళ్లుగా డేటా సెక్యూరిటీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చింది. ప్రభుత్వరంగ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతికంగా ఆత్మనిర్భరతపై దృష్టి సారించాలని పేర్కొంది. వ్యాపారం విషయంలో అమెరికా- చైనా మధ్య ఏళ్లుగా వార్ కొనసాగుతోంది. గతంలో చైనాకు చెందిన హువావే కంపెనీని అమెరికా బ్యాన్ చేసింది. టిక్‌టాక్‌పైనా నిషేధం విధించింది. ఇప్పుడు చైనా సైతం అదే చేస్తోంది. తాజా నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. అయితే దీనిపై చైనా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించలేదు. యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి.
దాదాపు ఐదో వంతు ఆదాయం చైనా నుంచే వస్తోంది. త్వరలో యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.