Declining fertility : ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తిపై కలవరం.. తగ్గిపోతున్న సంతానోత్పత్తి..

1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రపంచ దేశాల్లో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు

1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. కాగా భారత్లో 1950లో ఈ రేటు 6.18గా ఉంటే 2021 నాటికి 2కంటే తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం అమెరికాలో సంతానోత్పత్తి రేటు 1.6గా ఉండగా.. భారతదేశంలో 1.98గా, చైనాలో 1.7గా ఉన్నట్టు వివరించింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.3గా, 2100 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు 1.6గా ఉంటుంది.

  • సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణాలు..

దేశంలో మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్ళు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సంతానోత్పత్తి రేటులో తగ్గుదల అనేది ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ప్రపంచంలో తగ్గుతున్న జనాభతో చైనా, జపాన్, వంటి కొన్ని దేశాలు ముందే అప్రమత్తత వహించి.. పెళ్లి చేసుకున్న వాళ్లు.. పెళ్లి చేసుకోబోయే వాళ్లను దృష్టిలో పెట్టుకోని.. పిల్లను కంటే ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తామంటు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది.

  • పిల్లల్ని కంటే బంపర్ ఆఫర్..

చైనాలో అయితే అక్కడి ప్రభుత్వం.. జనాభా పెంచాలని ప్రభుత్వ ప్రోత్సహిస్తున్నాయి. చైనాలోని పలు కంపెనీలు పిల్లన్ని కంటే.. ఉద్యోగులకు అద్భుతమైన ఆఫర్లను ఇస్తున్నాయి. ఎంత మంది ఎక్కువ బిడ్డను కంటే.. అన్ని ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. గతంలో ఓ చైనీస్ కార్పొరేట్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. అక్కడ ఒక వ్యక్తి వరుసగా ముగ్గురు పిల్లలకి జన్మనిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులకు ఏడాది వరకు సెలవులు ఇస్తామని ప్రకటించాయి.

  • పిల్లల్ని కంటే.. రూ.3 లక్షలు బహుమతి

ఇక మరో వైపు.. ఇదే తరహాలో జపాన్ దేశం పలు ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా పెళ్లైన జంటలకు పిల్లలకు జన్మనించేందుకు.. ప్రోత్సాహక ఇస్తుంది. జపాన్‌లో ఒక జంటకు బిడ్డ పుడితే రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇలా ముగ్గురి వరకు కునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. కాగా ఇప్పుడు జపాన్ ప్రభుత్వం మరో కొత్త ఆఫర్ ను ప్రజలకు తీసుకోచ్చింది. గతంలో ఒక బిడ్డకు జన్మనిస్తే.. రూ.2.50 లక్షల ఆర్థిక సహాయంను.. రూ.3 లక్షలకు పెంచాలనే ఆలోచన చేస్తుంది. కాగా అక్కడి ప్రజలు పిల్లలను కనేందుకు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయ్యడం గానీ ముందుకొచ్చే చర్యలు కనిపించడం లేదు.

Suresh SSM