COVID 19: కరోనా నుంచి తప్పించుకోవాలంటే మరో బూస్టర్‌ డోస్‌ తప్పదా

కొన్ని రోజులకు తగ్గుముఖం క్రమంగా పట్టిన కరోనాకు ప్రజలు నెమ్మదిగా అలవాటు పడటం మొదలుపెట్టారు. ఐతే కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 ఇప్పుడు హడలెత్తిస్తోంది.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 03:27 PM IST

COVID 19: సరిగ్గా రెండేళ్ల క్రితం కరోనా వైరస్‌ మానవాళిని పెట్టిన టెన్షన్‌ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. ఏం లేకపోయినా పర్లేదు.. ప్రాణాలు ఉంటే చాలు అనుకుని గడపకూడా దాటకుండా బతికేశారు. ఆ రేంజ్‌లో భయపెట్టిన కరోనా.. ఒక్క వేరియంట్‌తో ఆగిపోలేదు. ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా ప్రభావం చూపించింది.

RAHUL GANDHI: రాహుల్ ప్రధానిగా పనికిరాడా ? కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఇండియా కూటమి

ఒక వేరియంట్‌ ప్రభావం తగ్గే గ్యాప్‌లోనే కొత్త వేరియంట్‌ వచ్చి మానవాళిని వేటాడింది. ఎటూ చూసినా ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. కొన్ని రోజులకు తగ్గుముఖం క్రమంగా పట్టిన కరోనాకు ప్రజలు నెమ్మదిగా అలవాటు పడటం మొదలుపెట్టారు. ఐతే కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 ఇప్పుడు హడలెత్తిస్తోంది. క్రమంగా పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య పాతరోజులను గుర్తుకు తెస్తోంది. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్‌ ఒకటే. కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్‌ డోస్‌లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా అని. వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదే కానీ.. వృద్ధులు, షుగర్‌, బీపీ, హార్ట్‌, కిడ్నీ, లివర్‌ పేషెంట్లు డాక్టర్లను సంప్రదించి బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం బెటర్‌ అంటున్నారు నిపుణులు. గత వేరియంట్లతో కంపేర్‌ చేసుకుంటే ఈ వేరియంట్‌ అంత ఎఫెక్టివ్ కాకపోయినా.. ఈ వేరియంట్‌ను లైట్‌ తీసుకోకూడదని చెప్తున్నారు.

ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ వేసుకోని వాళ్లు, ఒకే డోస్‌ తీసుకుని ఆగిపోయినవాళ్లు మాత్రమే ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం బెటర్‌ అని సూచిస్తున్నారు. ఇక అందరికీ మరోసారి బూస్టర్‌ డోస్‌ ఇచ్చే విషయంలో పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ కొత్త వేరియంట్‌ను ఇప్పటికే తయారు చేసిన బూస్టర్‌ డోస్‌ సమర్థవంతంగా ఎదుర్కుంటుందా లేదా అనే విషయంపై పరిశోధన చేస్తే మంచిదంటున్నారు. ఈ ఎక్స్‌పరిమెంట్‌ పూర్తైన తరువాత కొత్త వేరియంట్‌కు ఎలాంటి డోస్‌ ఇస్తే బెటర్‌ అనే విషయంలో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు.