COVID-19: కరోనాను సృష్టించింది చైనానే.. వూహాన్ శాస్త్రవేత్త వెల్లడి

కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనా అని, బయో వెపన్ (జీవాయుధం)గా వాడే ఉద్దేశంతోనే దీన్ని చైనా తయారు చేసిందని అదే దేశానికి చెందిన వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త చావో షావో వెల్లడించాడు. వూహాన్ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేసినట్లు చెప్పారు.

  • Written By:
  • Publish Date - June 29, 2023 / 06:48 PM IST

COVID-19: ప్రపంచాన్ని రెండేళ్లపాటు పీడించిన కరోనాను సృష్టించింది చైనాయే అని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. అనేక దేశాలు చైనాపైనే ఆరోపణలు చేశాయి. అయితే, ఈ విషయాన్ని చైనా కొట్టిపారేస్తూ వచ్చింది. కోవిడ్ సృష్టికర్త చైనానే అని చెప్పేందుకు చాలా ఆధారాలు లభించినా అవన్నీ నిరాధారమైనవేనని చైనా వాదించింది. కోవిడ్‌ను సృష్టించింది చైనానే అని అక్కడ పని చేసిన ఒక శాస్త్రవేత్త వెల్లడించారు.

కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనా అని, బయో వెపన్ (జీవాయుధం)గా వాడే ఉద్దేశంతోనే దీన్ని చైనా తయారు చేసిందని అదే దేశానికి చెందిన వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త చావో షావో వెల్లడించాడు. వూహాన్ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేసినట్లు చెప్పారు. తన పై అధికారి ఒకరు నాలుగు వైరస్ రకాలను ఇచ్చి, వాటిలో ఏది త్వరగా వ్యాప్తి చెందుతుందో, ఏది శక్తివంతంగా ఉంటుందో చెప్పాలని సూచించినట్లు షావో తెలిపారుు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షావో ఈ విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్‌ను చైనా సృష్టించిన బయో వెపన్‌గా ఆయన అభివర్ణించారు.
మాయమైన వైరాలజిస్టులు
చైనాలోని వూహాన్‌లో 2019లో మిలిటరీ వరల్డ్ గేమ్స్ జరిగాయి. ఈ సమయంలో షావో సహచరులు చాలా మంది కనిపించకుండా పోయారు. అథ్లెట్ల ఆరోగ్య పరీక్షల కోసం వారిని తీసుకెళ్లారనుకున్నారు. అయితే, అథ్లెట్ల ఆరోగ్య పరీక్షలకు వైరాలజిస్టులతో పనేముంటుందని, బహుశా వారికి కోవిడ్ వైరస్‌ను ఉద్దేశపూర్వకంగా అంటించేందుకే ఈ పని చేసుంటారని షావో భావించారు. ఆ తర్వాత కొంతకాలానికి.. అంటే 2020 ఏప్రిల్‌లో తనను జింజియాంగ్ పట్టనం పంపించినట్లు షావో చెప్పాడు. అక్కడి రీ ఎడ్యుకేషన్ సెంటర్లలో ఉన్న వుయిగర్ ముస్లింల ఆరోగ్యాన్ని పరీక్షించాల్సిందిగా కోరినట్లు చెప్పారు. అంటే అప్పటికే వారికి కోవిడ్ వైరస్ సోకి ఉండటమో.. లేక తన ద్వారా ఆ వైరస్‌ను వ్యాప్తి చేయడమో లక్ష్యంగా తనను అక్కడకు పంపి ఉండొచ్చని షావో అన్నారు. ఇప్పటికే వూహాన్‌ ల్యాబ్‌కు చెందిన చాలా మంది శాస్త్రవేత్తలు ఈ విషయంలో చైనాపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షావో కూడా చైనాపై కోవిడ్ విషయంలో ఇదే ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కోవిడ్ విషయంలో చైనా పాత్ర మరోసారి బయటపడింది.