Indian Street Food: వరస్ట్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఏంటో తెలుసా..? మీరూ తింటున్నారా..?

పలు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ జాబితాలో పెట్టగా.. దహీ పూరీ వరస్ట్ రేటింగ్ దక్కించుకుంది. 2,508 రేటింగ్స్‌లో దహీపూరీకి 1,733 వరస్ట్ రేటింగ్స్ ఇచ్చారు. దీన్ని బట్టి మన ఇండియన్స్ దహీ పూరీని ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - August 21, 2023 / 02:22 PM IST

Indian Street Food: స్ట్రీట్ ఫుడ్‌కు ఇండియా ఫేమస్. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏ రోడ్డుపై చూసినా, గల్లీల్లోకి వెళ్లినా.. ఎక్కడపడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుంది. మిర్చి బజ్జి, పానీ పూరీ, వడపావ్.. ఇలా అనేక రకాల స్ట్రీట్ ఫుడ్స్ కనిపిస్తుంటాయి. వీటిని ఇండియన్స్ ఇష్టంగా తింటుంటారు. అయితే, అన్నింటిలోకి వరస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఏంటో తెలుసా..? దహీ పూరీ. అవును దహీ పూరీ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌లోకి వరస్ట్‌గా నిలిచింది.

టేస్ట్ అట్లాస్ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ సంస్థ ఒక చిన్న సర్వే నిర్వహించింది. తమ వినియోగదారుల నుంచి దీనికి సంబంధించి రేటింగ్ ఆధారంగా ఏ స్ట్రీట్ ఫుడ్ వరస్టో నిర్ణయించింది. పలు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ జాబితాలో పెట్టగా.. దహీ పూరీ వరస్ట్ రేటింగ్ దక్కించుకుంది. 2,508 రేటింగ్స్‌లో దహీపూరీకి 1,733 వరస్ట్ రేటింగ్స్ ఇచ్చారు. దీన్ని బట్టి మన ఇండియన్స్ దహీ పూరీని ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. దహీ పూరీ తర్వాత రెండో స్ట్రీట్ ఫుడ్‌గా నిలిచింది సేవ్. చాట్‌తోపాటు వివిధ శ్నాక్ ఐటమ్స్‌లో సేవ్ వాడుతారనే సంగతి తెలిసిందే. మధ్య ప్రదేశ్‌లో అయితే.. ఇది బాగా ఫేమస్. అంత ఫేమస్ అయినప్పటికీ సేవ్ రెండో చెత్త స్ట్రీట్ ఫుడ్‌గా నిలిచింది. గుజరాత్‌లో ఎక్కువగా తినే దబేలి మూడో చెత్త స్ట్రీట్ ఫుడ్‌గా నిలిచింది.

బ్రెడ్లలో ఆలూ పెట్టి దీన్ని తయారు చేస్తారు. ముంబైలో ఇష్టంగా తినే బాంబే శాండ్‌విచ్ నాలుగో స్థానంలో నిలిచింది. బ్రెడ్ల మధ్యలో కూరగాయలు, మసాలా ఉంచి దీన్ని తయారు చేస్తారు. చెత్త స్ట్రీట్ ఫుడ్స్ జాబితాలో ఎగ్ బుర్జీ ఐదో స్థానంలో నిలవగా, దహీ వడ ఆరో స్థానంలో, సాబుదానా వడ ఏడో స్థానంలో ఉన్నాయి. పాప్రి (పాపడ్) చాట్ ఎనిమిదో స్థానంలో ఉంది. దీన్ని ఇండియాలోనే కాదు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా ఇష్టంగా తింటారు. గోబీ పరాటా తొమ్మిదో స్థానంలో ఉంది. పదో స్థానంలో బోండా నిలిచింది. టేస్ట్ అట్లాస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండియాలోని టాప్-10 వరస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవి. లిస్టులో ఇవి వరస్ట్‌ ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు కానీ.. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో చాలా ఐటమ్స్‌కు బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరి టేస్ట్ వారిది కదా..!