డయాబెటిస్.. ఉదయం లేవంగానే కాఫీ తాగాలంటే షుగర్ లెస్ అనే మాట వినిపిస్తుంది. ఇక టిఫిన్ విషయానికొస్తే షుగర్ ఫ్రీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. మధ్యాహ్నం అంటారా కొర్రలు, పచ్చ జొన్నలు, దంపుడు బియ్యం వంటి వాటితో కప్పు అన్నం రెండు కప్పుల కర్రీతో లంచ్ అయిపోతుంది. రాత్రి వచ్చే సరికి చపాతి, జొన్న రొట్టె గ్లాసు మజ్జిగ ఇది సాధారణంగా చేసే డైట్. మరికొందరైతే పూర్తి స్థాయి డైట్ ని ఫాలో అవుతారు. వారి ఆహార పదార్థాలు చాలా ప్రత్యేకంగా, కాస్త శ్రద్ధ, సమయం చూపించే విధంగా ఉంటాయి. ఉడికించిన పెసలు, ఆకులు, పచ్చి కూరగాయలతో సలాడ్ అంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు.
2050 నాటికి 130 కోట్ల మందికి
ఇదంతా ఒక ఎత్తైతే.. ఉదయం సాయంత్రం వాకింగ్ అంటూ.. వివధ రకాలా వ్యాయామాలు చేస్తూ, జిమ్ముల్లో పలు రకాలా ఫీట్లు చేస్తూ ఉంటారు. మరికొందరైతే స్విమ్మింగ్ వంటి పూర్తి స్థాయి శరీర అవయవాల కదలికతో ఉండే వ్యాయామాలను చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తారా అంటే అది కుదరని పని. ఎందుకంటే వారివారి వృత్తి దృష్ట్యా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. అలా పరుగులు తీస్తేనే జీవనం సాఫీగా సాగుతుంది. ఇలా వ్యాయామానికి దూరం అవుతూ.. సరైన డైట్ పాటించని కారణంగా రానున్న 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మధుమేహంతో బాధపడేవారి సంఖ్య 130 కోట్లు దాటుతుందని తాజాగా లాన్సెట్ మెడికల్ వారు ప్రచురించిన జర్నల్‌లో పేర్కొన్నారు. గతంలో 2021 నాటికి 52.9 కోట్ల కు పైగా డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
అధిక బరువు – వ్యాయామం లేకపోవడం
దీనికి గల ప్రదాన కారణం అధిక బరువు అంటున్నారు నిపుణులు. ఇలా ఉండాల్సిన దానికంటే కూడా అధిక బరువు కలిగి ఉండటాన్ని టైప్ – 2 డయాబెటిస్ అంటారు. వీరు ఇలాగే తమ శారీరంలోని క్రొవ్వుపై అశ్రద్ద చూపితే అది క్రమక్రమంగా టైప్ – 1 కి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య చేసిన సర్వే గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్ బారినపడుతున్నట్లు చెబుతున్నారు. వీరు యువకులు కావడం గమనించాల్సిన అంశం. 2021 లో ఈ వ్యాధి కారణంగా 67 లక్షల మందికి పైగా చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. డయాబెటిస్ నిర్మూలనలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
జాతి వివక్ష – ఆర్థిక స్థితిగతుల ప్రభావం
దీనిపై యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకుడు కెన్యిన్ లియేన్ ఓంగ్ స్పందిస్తూ సరైన ఆహారం, వ్యాయామం, శారీరక శ్రమ కలిగి ఉండాలని పేర్కొన్నారు. దీంతో పాటూ మరో కీలకమైన అంశాన్ని మరికొందరు ప్రస్తావించారు. జాతి వివక్ష కారణంగా, ఆర్థిక స్థితిగతుల కారణంగా కూడా ఈ సమస్య అధికంగా ప్రబలే ఆస్కారం ఉందని దీనికి సరైన పరిష్కారం కనుగొనడమే ఉత్తమమైన మార్గం అని లాన్సెట్‌లో ప్రచురితమైన మరో వ్యాసంలో పరిశోధకులు పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన దేశాలు, తక్కువ సంపదను సృష్టిస్తున్న దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఓంగ్ అనే పరిశోధకుడు తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
దీనికి సంజీవని సరైన డైట్
దీనికి సరైన పరిష్కార మార్గం అంటూ ఏమీ లేదట. ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకొని సరైన డైట్ ఫాలో అవ్వడమే ఉత్తమమని తెలిపారు. ఒక వేళ డయాబెటిస్ ను ప్రాధమిక దశలో గుర్తించి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సరైన చికిత్సతోపాటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఈ పరిశోధనలో మన దేశంతో పాటూ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ప్రముఖ నిపుణులు వివరించారు.
T.V.SRIKAR