వర్షాకాలం వచ్చిందంటే డెంగీ దడ మొదలువుతుంది. డెంగీ లక్షణాలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే జనం పెరిగిపోతారు. అదే ఆస్పత్రులకు క్యాష్ టైమ్. బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదే. మన టోటల్ బ్లడ్ ఫ్రొఫైల్ అందులో తెలుస్తుంది. ఏదైనా కౌంట్ తక్కువగా ఉంటే డాటర్ల సూచనలతో ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవచ్చు.. అయితే ఆస్పత్రులు ల్యాబ్‌లతో కుమ్మకై ఫేక్ ప్లేట్‌లెట్ కౌంట్ రిపోర్టును ఇస్తాయి. అది నిజం అని నమ్మే రోగులు ఆస్పత్రిలో అడ్మిట్ అవుతారు. అక్కడ నుంచి అసలైన గేమ్ మొదలవుతుంది. మనకు తెలియకుండానే మనం వీక్ ఐపోతాం. అవసరం లేని ట్రీట్‌మెంట్‌తో శరీరం పాడు చేసుకుంటాం. ప్లేట్‌లెట్ కౌంట్ పెంచుకునేందుకు తినాల్సినదాని కంటే ఎక్కువగా ఫ్రూట్స్ తినేస్తాం..దానికి తోడు మందుల సైడ్ ఎఫెక్ట్స్‌తో లేని రోగాలు రావడమే కాదు.. అప్పటికే ఉన్న రోగం తీవ్రత పెరుగుతుంది.. మళ్లీ ఆస్పత్రులకు వస్తాం.. మళ్లీ అదే రిపీట్.. ఇదో బిజినెస్..!
కేవలం డెంగీ సీజన్‌లోనే ఈ దందా జరుగుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే! తాజాగా పెద్దపల్లి మండలంలో జరిగిన ఘటన చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. కాపులపల్లి గ్రామానికి చెందిన సింగారపు సాయి కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్తే మంచిదని భావించాడు. జిల్లా కేంద్రంలోని మల్లికార్జున ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్‌ను సంప్రదించాడు. బ్లడ్‌టెస్ట్ చేయించుకోమన్నారు. ఆ టెస్ట్ రిపోర్టు చూసి సాయి కుమార్ షాక్ అయ్యాడు. తనకు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినట్టు అనిపించలేదు.. మరోవైపు డాక్టర్లమే అడ్మిట్ అవ్వకపోతే డేంజర్ అంటున్నారు.. దీంతో డౌట్ వచ్చిన సాయికుమార్ వేరే ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకున్నాడు.. అక్కడ రిపోర్టులో అంతా నార్మల్ అని వచ్చింది. సాయికుమార్‌కు మేటర్ అర్థమైంది. డాక్టర్ ఇదే విషయంపై నిలదీశాడు..అతను కేర్‌లెస్‌గా సమాధానం చెప్పడంతో ఆస్పత్రి ముందు ధర్నాకు దిగిన సాయికుమార్ తర్వాత ఇదే విషయాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.
సరే..సాయికుమార్‌కు డౌట్ వచ్చి మరోసారి వేరే ల్యాబ్‌లో టెస్టు చేయించుకున్నాడు కాబట్టి సరిపోయింది.. మరి అనుమానం రాని బాధితుల సంఖ్య ఎంత ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. డాక్టర్ ఏది చెబితే అదే వింటారు రోగులు. మరికొంతమంది ప్లేట్‌లెట్ కౌంట్‌పై అనుమానం ఉన్నా.. రెండోసారి డబ్బులు చెల్లించలేరు. ఎందుకంటే అప్పటికే ఏ అప్పో సప్పో చేసి టెస్టులు చేయించుకొని ఉంటారు. డాక్టర్ చెప్పింది సచ్చినట్టు వినడం తప్ప మరో గతి ఉండదు. ఇలా ఫేక్ ప్లేట్‌లెట్ కౌంట్‌కి చికిత్స తీసుకుంటే లేని రోగాలు కూడా వచ్చే ప్రమాదముంది. చాలామంది ఆహారం మానేసి కేవలం ఫ్రూట్స్‌పైనే బతుకుతుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు.. అయితే ఏదీ నకిలీ రిపోర్టో.. ఏదీ ఒరిజనల్ రిపోర్టో ప్రజలు గుర్తించలేరు. అందరు సాయికుమార్ లాగా రెండోసారి టెస్టు చేయించుకోలేరు.. ఆస్పత్రుల ఇలా ఎందుకు చేస్తాయంటే ల్యాబ్ యాజమాన్యం నుంచి వారికి కమీషన్ వస్తుంది. ఇక ఆస్పత్రిలోనే ల్యాబ్ ఉంటే ఆ దోపిడేనే వేరు. ఇలా కొంతమంది మోసగాళ్ల కారణంగా నిజంగా ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినవాళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తమకు అంతా బాగానే ఉందని..ఇదంతా మోసమని ట్రీట్‌మెంట్‌కు నిరాకరిస్తున్నారు. అటు ఫేక్ ప్లేట్‌లెట్ కౌంట్ మోసాలు గురించి ప్రభుత్వాలకు తెలియనిది కాదు.. అయినా ఏ చర్యలూ తీసుకోరు.. అది అంతే..!