Speeding Car : రోడ్డేమైనా నీ బా*ది అనుకుంటున్నావా.. ఓవర్‌స్పీడ్‌పై దూ* తీర్చేసిన జనాలు..

సంక్రాంతి (Sankranti) పండక్కి హైదరాబాద్‌లో చాలా మంది సొంతూర్లకు వెళ్లడంతో భారీగా ట్రాఫిక్‌ (Traffic Police) తగ్గింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ (Jubilee Hills), బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్‌ ప్రాంతాలు చిన్నపాటి లాక్‌డౌన్‌ (Lock Don) డేస్‌ను గుర్తు చేశాయి.

 

 

 

సంక్రాంతి (Sankranti) పండక్కి హైదరాబాద్‌లో చాలా మంది సొంతూర్లకు వెళ్లడంతో భారీగా ట్రాఫిక్‌ (Traffic Police) తగ్గింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ (Jubilee Hills), బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్‌ ప్రాంతాలు చిన్నపాటి లాక్‌డౌన్‌ (Lock Don) డేస్‌ను గుర్తు చేశాయి. ట్రాఫిక్‌ తగ్గడంతో భారీ స్థాయిలో పొల్యూషన్‌ కూడా తగ్గింది. సాధారణంగా భారీ రద్దీ ఉండే రోడ్లు కూడా ఖాళీ కాళీగా కనిపించాయి. దీంతో కొందరు బడాబాబులు తమ కార్లతో రోడ్లపై రైడింగ్‌లు కొట్టారు.

సైలెన్సర్లు మార్చి మరీ నానా హంగామా చేశారు. దీంతో రోడ్లపై వెళ్లే సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఇక జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ వన్‌లో ఓ వ్యక్తి చేసిన పని ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లింది. రోడ్లు ఖాళీగా కనిపించడంతో ఓ వ్యక్తి తన లాంబోర్గిని కారుతో రోడ్డు మీద రచ్చ రచ్చ చేశాడు. అత్యంత వేగంతో కార్ల మధ్య నుంచి దూసుకువెళ్తే ప్రయాణికుల్ని భయబ్రాంతులకు గురి చేశాడు. ఓ వ్యక్తి ఈ కారును వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కారు మాత్రమే నీది. రోడ్డు నీది కాదు అంటూ పోస్ట్‌ పెట్టాడు. చూస్తుండాగానే ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అటూ ఇటూ తిరిగి ఈ వీడియో పోలీసుల వరకూ వెళ్లింది.

దీంతో సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కారు సీజ్‌ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కారు ఓనర్‌ కోసం వెతుకుతున్నారు. అడ్రస్‌ తప్పుగా ఉండటంతో కారు ఓనర్‌నుపట్టుకోవడం కష్టంగా మారింది. పోలీసులు వెతుకుతున్నారన్న విషయం తెలియడంతో ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసుకుని తిరుగుతున్నాడట ఆ వ్యక్తి. అంత స్పీడ్‌తో కారు నడపటం దేనికి ఇప్పుడు తప్పించుకుని తిరగడం దేని. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని టాలెంట్‌ చూపిస్తే ఇలానే అవుతుందంటున్నారు నెటిజన్లు.