ఇటీవలికాలంలో గుండెపోటు వార్తలు ఎక్కువగా చూస్తున్నాం. జిమ్ చేస్తుండగా వ్యక్తి కుప్పకూలిపోయాడని.. బ్యాడ్మింటన్ ఆడుతుండగా ప్రాణాలు వదిలాడని.. రోడ్డుపైనే కానిస్టేబుల్ పడిపోయాడని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పైగా వాళ్లంతా 40 ఏళ్లు కూడా దాడని వారే. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారే. ఆ క్షణం వరకూ యాక్టివ్ ఉన్న వాళ్లు ఒక్కసారిగా అలా కుప్పకూలిపోతుంటే అసలు ఏం జరిగిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
నందమూరి తారకరత్న పాదయాత్రలో పాల్గొని నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటివరకూ ఎంతో యాక్టివ్ గా ఉన్న వ్యక్తి ఆ తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోయాడు. డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ అని నిర్ధారించారు. అలాగే.. ఓ కానిస్టేబుల్ హైదరాబాద్ లో రోడ్డుపై నడుస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఇంకొకరు జిమ్ చేస్తూ సడన్ గా ప్రాణాలు వదిలారు. సాధారణంగా కొలెస్టరాల్ అధికం కావడం వల్ల కొవ్వు రక్తనాళాల్లో పేరుకుపోయి అవి మూసుకుపోతాయి. అలాంటి సమయాల్లో గుండెకు రక్తప్రసరణ జరగక గుండెపోట్లు సంభవిస్తుంటాయి. కానీ అలాంటి లక్షణాలేవీ లేని వాళ్లు కూడా ఈ మధ్య కాలంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
కరోనా తర్వాత చాలా మంది గుండెపోట్లకు గురవుతున్నారు. కరోనాకు, గుండెపోట్లకు లింక్ ఉందని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు. కరోనా బారినపడి చికిత్స తీసుకున్నవారిలో 61శాతం మంది గుండె సంబంధ వ్యాధులతో సతమతం అవుతున్నట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధనలో తేలింది. కోవిడ్ టీకా తీసుకున్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందని నిర్ధారించింది. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో ఎక్కువ మందికి హార్ట్ బీట్ సమస్యలు తలెత్తుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. mRNA టీకా తీసుకున్న అమెరికన్లలో 84 శాతం మందికి గుండెపోటు ముప్పు ఉన్నట్టు ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారికంగా వెల్లడించింది. ఇలా కరోనా వ్యాక్సిన్లు విపరీతమైన దుష్పరిణామాలు కలిగిస్తున్నాయి.
భారత్ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని వేయించుకునేందుకు జనమంతా ఉత్సాహం చూపించారు. కొంతమంది థర్డ్ వేవ్ సమయంలో బూస్టర్ డోసులను కూడా వేయించుకున్నారు. ప్రభుత్వం కూడా బూస్టర్ డోసులు వేయించుకోవాలని ప్రకటించింది. ఇది చాలా మంది గుండెపోట్లకు కారణమైందనే ఆరోపణలున్నాయి. వ్యాక్సినే అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. వాటికి బూస్టర్ డోసులు తోడవడంతో సమస్యలు మరింత ముదురుతున్నాయి. దాని వల్లే ఇప్పుడు యువకుల్లోనూ గుండెపోట్లు సంభవిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. కొంతమంది వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ల దుష్పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ వేయించుకున్న వ్యాక్సిన్లు చాలు.. ఇకపై దూరంగా ఉండడని సూచిస్తున్నారు.