Donald Trump: అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ఈసారి గట్టి పోరు కనిపించబోతోంది. రీసెంట్‌గా వస్తున్న కొన్ని సర్వేల ప్రకారం.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గ్రాఫ్ రోజు రోజుకూ తగ్గుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక డెమొక్రాట్లకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సారి ఆ పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష రేసులో ఉంటారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది. బైడెన్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు.
KCR on Farmers: అదే స్ట్రాటజీ ! వాళ్ళు ఓట్లేస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా..?
ఇప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ట్రంప్‌తో పాటు నిక్కీ హేలీ, డాసాంటిస్, వివేక్ రామస్వామి ఉన్నారు. కానీ రీసెంట్‌గా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 44 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. మళ్లీ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేయాలని కోరుతున్నారు. ట్రంప్ తరువాతి స్థానంలో నిక్కీ హేలీ ఉన్నారు. దీంతో మరోసారి రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధ్యక్ష రేసులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక జో బైడెన్ గ్రాఫ్ కూడా రోజు రోజుకూ తగ్గుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో.. వచ్చే ఎన్నికల్లో బైడెన్ గెలిచే అవకాశాలు 45 శాతం మాత్రమే అని తేలింది. నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ ఎవరు పోటీ చేసినా రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి.
బైడెన్ కన్నా ట్రంప్ 4 పాయింట్లు ఆధిత్యతలో ఉన్నారు. ట్రంప్‌కు 52 శాతం ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా, రానున్న ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు, వచ్చే సంవత్సరం అధ్యక్ష ఎన్నికల నాటికి బైడెన్ వయస్సు 81 సంవత్సరాలకు చేరుతుంది. ఒకవేళ, బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం లభించి, ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తే, అమెరికా ప్రెసిడెంట్‌గా గెలిచిన అత్యంత వృద్ధుడిగా బైడెన్ రికార్డు సృష్టిస్తారు.