Donald Trump: ట్రంప్‌ను చంపేసిన కొడుకు.. ఎలా జరిగిందంటే..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చనిపోయాడంటూ.. ఆయన కుమారుడు ట్వీట్ చేయడం కలకలం రేపింది. ఐతే అతడి అకౌంట్‌ హ్యాక్ అయిందని తర్వాత తెలిసింది. ట్రంప్‌ చనిపోయాడంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్‌ కలకలం రేపింది. ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి ఇది బయటకు రావడం కారణంగా మారింది.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 08:16 PM IST

Donald Trump: టైటిల్ చూసి అవాక్కయ్యారా.. అదే జరిగింది మరి..! అయితే, అక్కడే ఉందో ట్విస్టు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చనిపోయాడంటూ.. ఆయన కుమారుడు ట్వీట్ చేయడం కలకలం రేపింది. ఐతే అతడి అకౌంట్‌ హ్యాక్ అయిందని తర్వాత తెలిసింది. ట్రంప్‌ చనిపోయాడంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్‌ కలకలం రేపింది. ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి ఇది బయటకు రావడం కారణంగా మారింది. ఐతే ఆయన అకౌంట్‌ హ్యాక్‌ అయిందని తర్వాత తేలింది.

తన తండ్రి ట్రంప్‌ మరణించారంటూ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఎక్స్‌ ఖాతా నుంచి ఈ ఉదయం ఓ పోస్ట్‌ వచ్చింది. అంతేకాదు 2024ఎన్నికల్లో తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తాననేది.. ఆ పోస్ట్ సారాంశం. అదే ఖాతా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను దూషిస్తూ పలు పోస్టులు కూడా వెలువడ్డాయ్. ఐతే ట్రంప్‌ జూనియర్‌ అకౌంట్‌ ఎక్స్ ఖాతా హ్యాక్‌ అయినట్లు తర్వాత గుర్తించారు. కాసేపటికే పాత పోస్టులను తొలగించారు. అయినప్పటికీ సంబంధిత స్క్రీన్‌షాట్‌ మాత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదంతా ఎవరు చేసిందీ తెలియలేదు.

మరోవైపు తాను మరణించానంటూ సోషల్‌మీడియాలో వచ్చిన ప్రచారాన్ని ట్రంప్‌ ఖండించారు. కుమారుడి ఖాతా నుంచి పోస్టు వెలువడిన సుమారు అరగంట తర్వాత తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో తాను బతికే ఉన్నానంటూ ట్రంప్‌ పోస్ట్‌ పెట్టారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాను పోటీచేస్తానని ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ట్రంప్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.