‌Hen Or Egg: కోడి ముందో.. గుడ్డు ముందో తేల్చేసిన ప్రయోగం.. కొన్ని వందల సంవత్సరాల నాటి సందేహానికి తెర..

దశాబ్ధాలుగా చాలామంది ప్రజలను, పండితులను, అవధానులను, శాస్త్రవేత్తలను జుట్టు పీక్కునేలా చేసిన విషయం ఒకటి ఉంది. అదే కోడి ముందా..? లేక గుడ్డు ముందా..? అనే జీవశాస్త్ర అంశం. తాజాగా 50 కిపైగా శిలాజాలను, 30 రకాల జీవ కణాలను పరిశీలించిన మీదట కోడే ముందు అనేలా ఫలితాలు వెలువడ్డాయట. ఈ విషయాన్ని నేచర్ అంకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్ లో పేర్కొంది. ఇలా చెప్పడానికి ఒక సరైన ప్రామాణికం ఉందా..? లేకుండా టూకీగా చెప్పేశారా..? ఇలా ఎలా చెప్పారో పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 03:21 PM IST

సాధారణంగా గుడ్లు పెట్టే జీవులు, నేరుగా పిల్లలను ఉత్పత్తి చేసే ప్రాణులు ఇలా రెండు రకాలుగా ఉన్నప్పుడు గుడ్డు ముందా.. లేక జీవి ముందా అనే ప్రశ్న సమాజంలో తలెత్తడం సర్వసాధారణం. అందుకనే వీటిని పరిశీలించేటప్పుడు రెండు రకాలుగా విభజించారు. అందులో ఒకటి ఓవిపరస్ అంటే గుడ్ల ద్వారా సంతానోత్పత్తి జరిపేవి. రెండవది విపరస్ అంటే నేరుగా పిల్లలను జన్మనిచ్చేవిగా తెలిపారు. మొదట చెప్పుకున్న ఓవిపరస్ జాతి జీవులు బలమైన, మృదువుగా ఉండే వివిధ వర్ణాల్లో పెంకులతో కూడిన గుడ్డు పెడతాయట. అదే విపరస్ జాతికి చెందినవి నేరుగా సంతానోత్పత్తి చేస్తాయని ప్రాదమికంగా నిర్ధారణ అయినట్లు ఈ పరిశోధన సారాంశం. విపరస్ జీవుల్లో అంతరిచిపోయిన క్లాడ్ జాతికి చెందిన అండాశయాలు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇలా దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ఎక్స్ టెండెడ్ ఎంబ్రియో రిటెన్షన్ (ఈ ఈ ఆర్) అనేది మొదట్లో పునరుత్పత్తి చెందే దశలో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అంటే దీనిని బట్టి చాలా కాలం పాటూ పిండాల రూపంలో ఉండి ప్రకృతిలో వాతావరణం అనుకూలించినప్పుడు వాటంతట అవే గుడ్డులోపల నుంచి బయటకు వచ్చేలా ఏర్పాటు చేసుకున్న ప్రక్రియగా తెలిసింది.

జీవశాస్త్రం ప్రకారం చెప్పాలంటే అమ్నియేట్స్ కంటే ముందు వర్టిబ్రేట్స్ ఎంబ్రయోనిక్స్ గా కొన్ని ప్రాణులు అభివృద్ది చెందాయని తెలిపారు. ఇవి క్రమక్రమంగా టాట్రోపోడ్స్ అంటే ఉభయచరజీవులుగా రూపాంతరం చెందాయట. నీటిలోనూ, నేలమీద జీవించేందుకు అనువుగా ఉండేలా వీటి జీవనిర్మాణ ప్రక్రియ ఏర్పాటు అయినట్లు తెలుస్తుంది. వీటికి సరైన ఉదాహరణలే కప్పలు, పాములు, సాలమండల వంటి ప్రాణులుగా చెప్పవచ్చు. దాదాపు 320 మిలియన్ ఏళ్ల క్రితం నుంచే అమ్నియేట్లు భూమిపై ఉన్నట్లు గుర్తించబడింది. వీటికి వాటర్ ఫ్రూఫ్ చర్మంతోపాటూ ఇతర ప్రదాన అవయవాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నీటిలో కొంతకాలం, నేలమీద మరికొంత కాలం జీవించినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలా ఉండే క్రమంలోనే అమ్నియాటిక్ ఎగ్ సృష్టి జరిగింది. ఈ గుడ్డులో ఉమ్మనీరు ఉంటుందని ఇదే వీటి మనుగడకు కీలకం అని తేలింది. ఇవే క్రమక్రమంగా బల్లులు, పాములుగా మారి వాటికి అనువైన పునరుత్పత్తి వైపుకు అడుగులు వేశాయని చెబుతున్నారు నిపుణులు.

ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం ఓవిపరిస్, విపరిస్ గురించి ముందుగా తెలుసుకున్నాం. వీటి ఉత్పత్తి ఎలా జరిగిందో కూడా పైన గమనించాం. ఈ విధానం ద్వారానే పిల్లలు నేరుగా కనవచ్చు. లేదా వాతావరణ మార్పులకు తగినట్లు కొంతకాలానికి అయినా వాయిదా వేసుకోవచ్చు. ఈ విధంగా జీవం పోసుకునేలా వీటిలో కణాలు వృద్దిచెందుతాయని డాక్టర్ జోసెఫ్ కీటింగ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ సేకరించిన సమాచారం ప్రకారం అయితే కోడే ముందు అని స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసిన తరువాత శాస్త్రీయంగా, మరింత ఖచ్చితమైన సమాధానం లభించే అవకాశం ఉంది.

 

T.V.SRIKAR