ఆగ్రా నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడికి ఆల్కహాల్ ఎలర్జీ ఉన్నట్లు నిర్దారించారు. జాన్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి కలిసి రిసార్ట్‌కి వెళ్లి పార్టీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అందరు కలిసి మద్యం సేవించారు. ఐతే పదిహేను నిమిషాల తర్వాత జాన్ శరీరంలో మార్పులు వచ్చాయ్. మొహం నుంచి వేడి రావడం, ఎర్రబడడం.. చర్మంపై దురదలు రావడం. చాతి పట్టేసినట్లు అనిపించి.. బరువుగా మారడం.. తల దిమ్ముగా ఉండడంలాంటి లక్షణాలు కనిపించాయ్. క్షణాల్లోనే ఆరోగ్యం విషమించగా.. స్నేహితులు ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత కొన్ని నెలలు మందు మానేసిన జాన్.. ఆ తర్వాత మళ్లీ తాగాడు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు. దీంతో కీలక పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అతనికి ఆల్కహాల్ ఎలర్జీ ఉన్నట్లు గుర్తించారు. ఐతే డాక్టర్లు చెప్పిన మాటలు ఇప్పుడు మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయ్. మందుతో పాటు నూనెలో వేయించి మసాలా పల్లీలు, బఠానీలు, మసాలా ఫుడ్ ఐటమ్స్, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్‌లాంటివి తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుందని.. అది ఎలర్జీకి దారి తీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.