Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదు..

భూకంపం వచ్చిన సమయంలో స్థానిక ప్రజలు నిద్ర మత్తులో ఉన్నారు. భూంకపాన్ని గుర్తించి, ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో పాక్‌లో ఇది రెండో భూకంపం. దీని కారణంగా ఇటీవల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 11:53 AM IST

Earthquake: పాకిస్తాన్‌లో బుధవారం తెల్లవారుఝామున భూకంపం సంభవించింది. ఉదయం ఐదున్నర గంటల సమయంలో, పాక్ ఉత్తర ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. భూకంపం వచ్చిన సమయంలో స్థానిక ప్రజలు నిద్ర మత్తులో ఉన్నారు. భూంకపాన్ని గుర్తించి, ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో పాక్‌లో ఇది రెండో భూకంపం. దీని కారణంగా ఇటీవల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Mrunal Thakur: ప్రేమ పక్షులు.. మృణాల్‌తో డేటింగ్.. సింగర్ పోస్టు వైరల్..

ఎప్పుడు, ఎలాంటి భూకంపం సంభవిస్తుందో అని ఆందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా భారత ఉప ఖండంలోనూ భూకంపం నమోదవుతోంది. ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల్లో ఇటీవల భూ కంపాలు తరచూ సంభవిస్తున్నాయి. అంతకుముందు నేపాల్, అఫ్ఘనిస్తాన్, శ్రీలంకల్లో కూడా వరుస భూకంపాలు సంభవించాయి. శ్రీలంకలోనూ ఇదే తీవ్రతతో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవత్ర రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం మధ్యప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం వల్ల శ్రీలంక, సింగపూర్, మలేసియా దేశాలు ఉలిక్కిపడ్డాయి. సునామీ సంభవించవచ్చనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ నెల 3, అర్ధరాత్రి దాటిన తరువాత నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 150 మంది వరకు మరణించారు.

రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. రెండు జిల్లాలను అతలాకుతలం చేసింది. అదే సమయంలో ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లోనూ భూమి ప్రకంపించింది. వేలాది మంది ప్రజలు రోడ్లపై చేరుకున్నారు. రాత్రంతా రోడ్ల మీదే జాగారం చేశారు. ఆ తరువాత కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.