Warangal: వరంగల్‌లో భూకంపం.. అధికారులు ఏం చెప్పారంటే..

వరంగల్‌కు తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో, 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. ఇది సరిగ్గా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర సంభవించినట్లు NCS ట్విట్టర్ పోస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. తెల్లవారుజామునే భూప్రకంపనలతో వరంగల్ వాసులు వణికిపోయారు.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 12:58 PM IST

Warangal: వరంగల్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషాలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది. దాదాపు 30 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించిందని తెలిపింది. వరంగల్‌కు తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో, 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. ఇది సరిగ్గా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర సంభవించినట్లు NCS ట్విట్టర్ పోస్ట్‌ను బట్టి అర్థమవుతోంది.

తెల్లవారుజామునే భూప్రకంపనలతో వరంగల్ వాసులు వణికిపోయారు. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప భూకంపం కావడంతో వెంటనే ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటివరకు భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. ఐతే చాలామందికి ఇది భూకంపం అని గుర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. జనాలంతా గాఢనిద్రలో ఉన్నప్పుడు.. భూమి కంపించింది. ఐతే ప్రకంపనల తీవ్రత చాలా తక్కువ అని.. ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు అంటున్నారు. ఏమైనా వరంగల్‌లాంటి నగరంలో భూకంపం రావడం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడు పెద్దగా ప్రమాదం జరగకపోయినా.. భూకంపం అనే మాటే.. అక్కడి జనాల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది.

ఐతే జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భూకంపానికి గల కారణాలపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. భూకంపం వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనకు లోనవకుండా ఇతరులకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని.. సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలని సూచిస్తున్నారు. ఇళ్లు, భవనాల్లో ఉండకుండా ఓపెన్ ప్లేస్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.