ELECTRIC BUS: విజయవాడ -హైదరాబాద్ మధ్య మెట్టమెదటి ఎలక్ట్రిక్ బస్సు..!

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 11:15 AM IST

టెక్నాలజీ పెరిగేకొద్దీ కాలం టూ స్మార్ట్ గా తయారవుతుంది. కాలంతోపాటూ మనం కూడా పరుగులు తీయక తప్పదు. మన అరచేతిలోకి ప్రపంచం రావడానికి చాలా దశాబ్ధాలు పట్టింది కానీ మనం నిలుచున్న భూమిపైకి రావడానికి చాలా తక్కువ సమయం పట్టిందని చెప్పాలి. ఆ టెక్నాలజీ ఎలక్రిక్ వాహనాల రూపంలో సైకిల్స్ తో ప్రారంభమై ఇప్పడు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే బస్సుల వరకూ వచ్చేసింది. దీనిని ముందుగా ఢిల్లీ మహానగరంలో ప్రయోగం చేసి ప్రారంభించారు. అది విజయవంతం కావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం దీనిని మన తెలుగు రాష్ట్రాల్లో ఆచరణలోకి తీసుకువచ్చారు.

 

విజయవాడ నుంచి హైదరాబాద్ వరకూ ప్రయాణం చేసే తొలి ఎలక్ట్రిక్ బస్సుగా గుర్తింపు పొందిందని చెప్పాలి. ఇందులో ప్రయాణీకుల సామర్థ్యం విషయానికొస్తే 45 మంది ఒకే సారి సాఫీగా ప్రయాణం చేయవచ్చు. దీనిని ఒక్కసారి డబుల్ చార్జర్ సహాయంతో చార్జ్ చేస్తే 350 కిలోమీటర్ల వరకూ మైలేజ్ వస్తుంది. కానీ ప్రస్తుతం 300 కిలో మీటర్ల వరకే వినియోగించుకుంటున్నారట. బ్యాటరీ ఫుల్ గా చార్జింగ్ అవ్వడానికి ఒక గంట 30 నిమిషాల సమయం పడుతుంది. సూర్యాపేటలో 20 నిమిషాల పాటూ బ్రేక్ ఇచ్చి అక్కడ కూడా కొద్దిసేపు చార్జ్ చేస్తారు. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. అవసరమైతే మరిన్ని సర్వీసులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

బస్సు లోపల ఇంటీరియర్ కూడా అత్యంత అధునాతనంగా రూపొందించారు. లగేజ్ పెట్టుకునే సౌకర్యంకూడా ఉంది. సిట్టింగ్ కూడా చాలా క్లాస్ లుక్ తో ఆకర్షిస్తుంది. డోర్ కర్టన్స్, సెంట్రలైజ్ ఏసి సిస్టంతో పాటూ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 7 సిసిటివి కెమెరాలను ను ఇందులో అమర్చారు. బస్సులోనే చిన్న మానిటర్ ను కూడా ఫిక్స్ చేశారు. ఏ సంఘటనలు జరిగినా అప్పటికప్పుడే గుర్తించవచ్చు. బస్సులో సాధారణంగా మన తోటి ప్రయాణీకుల లగేజ్ పోవడం, అమ్మాయిలకు ఆకతాయిల వేధింపులు వంటివాటిని చెక్ పెట్టవచ్చు. లిక్విడ్ కూల్ బ్యాటరీ సిస్టం ఇందులో ఉండటం వల్ల బ్లాస్ట్ అయ్యే అవకాశమే లేదు.