Uganda: 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు.. 578 మంది మనవాళ్ళు, మనవరాళ్లు! ఇప్పుడు పేర్లు మర్చిపోయాడు..!

102 మంది పిల్లలు, 578 మంది మనవాళ్ళు, మనవరాళ్లు కలిగి ఉన్న యుగాండాకు చెందిన ఓ వ్యక్తి తన తప్పును ఎట్టకేలకు అంగీకరించాడు. ఇంతమంది పిల్లలను కనడం బాధ్యతారాహిత్యమని ఒప్పుకున్నాడు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 10:32 AM IST

Uganda: ఒకరిద్దరిని కని పెంచడమే కష్టమైపోయిన రోజులివి. బయట ధరలు అలా ఉంటున్నాయి. బాగా డబ్బులు సంపాదిస్తే కానీ పెళ్లీ చేసుకోనని చెబుతున్న ప్రసాదులు ఎక్కువగా ఉన్న కాలమిది. అయితే ఈ వ్యక్తికి సంబంధించిన భార్యలు, పిల్లల లిస్ట్ చెబితే మాత్రం మైండ్ బ్లాక్‌ అవ్వడం పక్కా!
ఆడవాళ్లని శృంగారం కోసమే అనేలా చూసే కల్చర్‌ చాలా దేశాల్లో ఉంది. మన ఇండియాలోనూ కొంతమంది అలానే చూస్తుంటారు..! కొన్ని వర్గాల్లోనూ ఈ తరహా మైండ్‌సెట్ ఈనాటికి కొనసాగుతూ ఉంది. అయితే కొన్ని చట్టాలు భారతీయులను కంట్రోల్‌లో ఉంచుతున్నాయి. అయితే ఈ చట్టాలు కూడా కొన్ని మతాలకే పరిమితమవడం యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ నీడ్‌ని నొక్కి చెబుతోంది. ఇక ఇదంతా మన దేశం సంగతి.. కొన్ని దేశాల్లో మాత్రం పాలిగామి(ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే వెసులబాటు) నేరం కాదు.. అది మగవాళ్ల హక్కు!
102 మంది పిల్లలు, 578 మంది మనవాళ్ళు, మనవరాళ్లు కలిగి ఉన్న యుగాండాకు చెందిన ఓ వ్యక్తి తన తప్పును ఎట్టకేలకు అంగీకరించాడు. ఇంతమంది పిల్లలను కనడం బాధ్యతారాహిత్యమని ఒప్పుకున్నాడు. యుగాండా గ్రామస్థుడు మూసా హసహ్యా కసేరా భార్యలు, పిల్లల సంఖ్య చూసి యావత్‌ ప్రపంచం షాక్‌ అవుతోంది. అసలు అంతమంది పిల్లలకు ఎలా తండ్రి అయ్యాడు రా బాబు అని అంతా ముక్కున వేలేసుకుంటారు. అందులో ఇది ‘ఆనాటి’ కాలం కూడా కాదు. ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లలని కనడం లాంటి కల్చర్‌కు చాలా దేశాలు ఎప్పుడో చరమగీతం పాడేశాయి. కానీ యుగాండాలో అలా కాదు. అక్కడ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. అందుకే ప్రపంచంలో అత్యధిక జనన రేటు ఉన్న దేశాలలో యుగాండా ఒకటి.
ఇంతమందిని పెళ్లి చేసుకున్న మూసా ఆఖరితి తన ఆస్తులన్ని కోల్పోతూ వచ్చాడు. 102మంది పిల్లలను పెంచడం అసాధ్యంగా మారింది. ఆన ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు కేవలం రెండు ఎకరాల పొలం మాత్రమే అతనికి మిగిలి ఉంది. మూసా పట్టించుకోవడంలేదని అతని 12 మంది భార్యల్లో ఇద్దరు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. మూసాకు తన పిల్లల పేర్లు కూడా గుర్తు లేవు. మొదట పుట్టిన బిడ్డతో పాటు ఆఖరిగా(102) పుట్టిన బేబీ పేరు మాత్రమే అతనికి గుర్తింది. ప్రస్తుతం అతని వయసు 68ఏళ్లు..!
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇంతమంది పిల్లలకి తండ్రి అయిన మూసా ఇప్పటికి తన బుద్ధిని మార్చుకోలేదు. బర్త్‌ కంట్రోల్‌కి సంబంధించి అతను ఇప్పటికీ ఎలాంటి ‘సేఫ్టీ’ యూజ్ చేయడు. తన భార్యలనే బర్త్‌ కంట్రోల్ పిల్స్‌ యూజ్‌ చేయమంటాడు. వాళ్లంతా అదే చేస్తారు. ఆడవాళ్లు ‘అందుకు’ మాత్రమే పనికొస్తారనే ఫీలింగ్ ఆయనది. అందుకే ఇంతమంది భార్యలు.. ఇంతమంది పిల్లలు.. లెక్క చూస్తే అర్థమవుతుందిగా! మూసా భార్యలు ఇప్పుడు గర్భనిరోధక మాత్రలు వేసుకుంటూ మూసా చెప్పిందే వింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ల హెల్త్‌ ఎంత చెడిపోతున్నా మూసా మాత్రం వాళ్లనే ట్యాబ్లెట్స్‌ మింగమంటాడు కానీ.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్స్‌ లేని సేఫ్టీని మాత్రం అతను ఉపయోగించడు.. ఎంతైన మగ ఆహంకారి కదా ఈ ‘ముస’! అంతే ఉంటుంది మరి!