Ayodhya, Balak Ram statue : ప్రతి రోజూ కోతి వచ్చి పలకరించేది… బాలక్ రామ్ విగ్రహ శిల్పి యోగిరాజ్

అయోధ్యలోని (Ayodhya) శ్రీరామ మందిరంలో (Sri Ram temple) బాలక్ రామ్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కు ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. చూడగానే ఆకట్టుకునేలా... ప్రతి ఒక్క భక్తుడూ తన్మయత్వంతో మురిసిపోయే అద్భుతమైన బాల రాముడిని చెక్కారు శిల్పి యోగిరాజ్ (Yogiraj) … బహుశా... ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరేమో... అని ఆయన అన్నారంటే... అది నిజమే మరి.

అయోధ్యలోని (Ayodhya) శ్రీరామ మందిరంలో (Sri Ram temple) బాలక్ రామ్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కు ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. చూడగానే ఆకట్టుకునేలా… ప్రతి ఒక్క భక్తుడూ తన్మయత్వంతో మురిసిపోయే అద్భుతమైన బాల రాముడిని చెక్కారు శిల్పి యోగిరాజ్ (Yogiraj) … బహుశా… ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరేమో… అని ఆయన అన్నారంటే… అది నిజమే మరి. ఎంతో కఠోర దీక్షతో రామ్ మందిర్ ట్రస్ట్ (Ram Mandir Trust) అప్పగించిన పనిని పూర్తిచేశాడు. తాను రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు… ప్రతి రోజూ ఓ కోతి వచ్చి పలకరించి వెళ్ళేదని చెబుతున్నాడు అరుణ్ యోగిరాజ్.

అయోధ్యలో రామ్ లల్లా (Ram Lalla Ayodhya) విగ్రహం తయారు చేయడానికి మైసూర్ కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంతో కష్టపడ్డారు. వేల యేళ్ళ వరకూ చెక్కు చెదరని కృష్ణశిలతో బాల రాముడిని అందంగా తీర్చిదిద్దాడు. తను విగ్రహం తయారు చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకుంటున్నాడు అరుణ్. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో తన ఇంటికి ప్రతీ రోజూ ఓ కోతి వచ్చేదట. పెద్దగా అరుచుకుంటూ… డోర్ తెరుచుకొని లోపలికి వచ్చి… అరుణ్ ని… బాలక్ రామ్ విగ్రహాన్ని చూసి వెళ్లిపోయేదట. అంటే ఆ హనుమంతుడే వచ్చి తనను పరీక్షించాడని అంటున్నాడు యోగిరాజ్. అయోధ్యలో బాలక్ రామ్ ప్రతిష్ట జరిగిన రెండో రోజున కూడా ఓ వానరం నేరుగా గర్భగుడిలోకే వచ్చింది. రాముడిని దర్శించి… చుట్టూ తిరిగి …కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోయినట్టు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. రాముడి గురించి భజనులు జరుగుతున్నా… రాముడి విగ్రహాలు ఎక్కడ ఉన్నా…అక్కడికి హనుమంతుడు కోతి రూపంలో వస్తాడని హిందువులు నమ్ముతుంటారు.

బాల రాముడి విగ్రహం తయారు చేసి అయోధ్య రామ మందిర్ తీర్థ ట్రస్ట్ కి అప్పగించిన తర్వాత… ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకోవడం సంతోషంగా అనిపించింది అంటున్నారు శిల్పి అరుణ్ యోగిరాజ్. గర్భగుడిలో రాముడి ప్రతిష్టాపన అయిపోయాక… తన బాధ్యత తీరిపోయిందని చెప్పాడు. వేరే పనిలో రోజుకు పది, పన్నెండు గంటలు కష్టపడుతున్నట్టు చెప్పాడు. బాల రాముడి విగ్రహం తయారు చేసే సమయంలో ….9 నెలల పాటు మిగతా ఎలాంటి పనీ ఒప్పుకోలేదన్నాడు. నూటికి నూరు శాతం రాముడి విగ్రహం తయారీపైనే దృష్టి పెట్టానన్నాడు. దాని వల్ల తనకు మానసిక ప్రశాంతత లభించందని చెప్పాడు. అరుణ్ యోగిరాజ్ ఎంబీఏ చదివిన తర్వాత తన 5 తరాల పూర్వీకుల నుంచి వస్తున్న కుటుంబ వృత్తి… శిల్పాల తయారీని చేపట్టాడు. బాలక్ రామ్ విగ్రహ తయారీ తరువాత యోగిరాజ్ కు గిరాకీ పెరిగింది. దేశ వ్యాప్తంగా చాలా ఏరియాల నుంచి అతనికి ఆర్డర్స్ వస్తున్నాయి.