Wayanad : వాయనాడ్ లో సినిమా సీన్, ఆరుగురు ప్రాణాలు కాపాడటం కోసం…

వాయనాడ్ (Wayanad) లో ప్రకృతి (Natural Disaster) సృష్టించిన విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కలలో కూడా ఊహించని విధంగా, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి విపత్తు చూడటం కంటే చావడం మేలు అన్నట్టుగా విరుచుకుపడ్డాయి వరదలు, కొండచరియలు.

 

 

వాయనాడ్ (Wayanad) లో ప్రకృతి (Natural Disaster) సృష్టించిన విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కలలో కూడా ఊహించని విధంగా, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి విపత్తు చూడటం కంటే చావడం మేలు అన్నట్టుగా విరుచుకుపడ్డాయి వరదలు, కొండచరియలు. ప్రస్తుతం వాయనాడ్ లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య 300 దాటింది. ఇంకా 300 మంది ఆచూకి తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక కుటుంబాన్ని కాపాడుకోవడానికి కేరళ ఫారెస్ట్ అధికారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేసారు. భీకరమైన ప్రకృతితో పోరాటం చేస్తూ ఆరు ప్రాణాలు కాపాడారు. అటవీ ఉత్పత్తులను సేకరించి, మార్కెట్‌ లో విక్రయించి వారికి సరిపడా ఆహార పదార్ధాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారు అందరూ ఒక గుహలో ఉన్నారని అధికారులకు సమాచారం వచ్చింది. దీనితో ఎలాగైనా కాపాడుకోవాలని భావించి… మొత్తం నలుగురు అధికారులు రంగంలోకి దిగారు.

ఫారెస్ట్ అధికారి హసిష్ తో పాటుగా సెక్షన్ ఫారెస్ట్ అధికారి బీఎస్ జయచంద్ర (BS Jayachandra), బీట్ అధికారి కే అనిల్ కుమార్, ఆర్ఆర్టీ అనూప్ థామస్ (RRT Anoop Thomas) కలిసి ట్రెక్కింగ్ చేస్తూ వారి వద్దకు వెళ్ళారు. చిన్నారులు ఆకలితో ఉన్నారని తెలుసుకున్న అధికారులు తమతో పాటు ఆహార పదార్ధాలను కూడా తీసుకువెళ్ళారు. వారికి ఆహారం తినిపించి చిన్నారులను తమ వీపుకు కట్టుకుని గుహలో నుంచి వారిని నిదానంగా తీసుకొచ్చారు. ఈ క్రమంలో చెట్లు, రాళ్ళకు తాళ్ళు కట్టి నిదానంగా వారిని కిందకు దించారు. అలా అత్తమాల కార్యాలయానికి వారిని తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆపరేషన్ కు మొత్తం 8 గంటల సమయం పట్టింది. ప్రస్తుతం వాయనాడ్ లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు వెల్లడించారు. మరో వారం పాటు సహాయక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.