Ganga River: వచ్చే నెల నుంచే గంగా పుష్కరాలు.. గంగా పుష్కరాలు వచ్చేస్తున్నాయి..!

రాశిచక్రంలోని పన్నెండు రాశుల్లోనూ బృహస్పతి ఒక్కో రాశిలో సంచరిస్తున్నప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 02:25 PM IST

ఆ విధంగా మేషరాశిలో బృహస్పతి సంచరించే కాలంలో వచ్చేవే గంగా పుష్కరాలు. దేవ గురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారిన మొదటి 12రోజుల్లో పుష్కర విధులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2023 ఏప్రిల్ 22 శనివారం నుంచి 2023 మే 3 బుధవారం వరకు గంగమ్మకు పుష్కరోత్సవం జరగనుంది.

భారతీయులకు గంగానది అంటే అత్యంత పవిత్రం. స్వర్గలోకంలో ఉండే మందాకినిని భగీరథుడు తన ఘోరతపస్సుతో నేలపైకి వచ్చేలా చేసాడు.
మూడులోకాల్లోనూ ప్రవహించే కారణంగా గంగను త్రిపథగ అని పిలుస్తారు. గంగానది పుట్టిన గంగోత్రి, హరిద్వార్, వారణాసి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గంగానది
పుష్కర విధులను ఆచరించడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తుంటారు.

పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధవిధులు నిర్వహిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని విశ్వాసం. గంగా అని పిలిచినా. ఆ నీటిలో ఒక్క మునక వేసినా మహాపుణ్యంగా భావించే భక్తులు.. పుష్కరాల సమయంలో గంగాస్నానం, దానం వంటివి చేస్తే వెయ్యి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని అంటారు.