Meteor Shower: ఆకాశంలో అద్భుతం.. రెండు రోజులే..

శకలాలు కొన్ని భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మిరిమిట్లు గొలిపే కాంతి వెదజల్లుతూ మండిపోతాయి. వీటిని ఉల్కాపాతం అంటారు. అయితే, ఇలాంటివి చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి.

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 12:00 PM IST

Meteor Shower: ఆకాశంలో అద్భుత జరుగుతోంది. ఉల్కపాతం కనువిందు చేస్తోంది. ఎలాంటి ప్రత్యేక పరికారాల అవసరం లేకుండా రెండు రోజుల పాటు ఈ అద్భుతాన్ని మనం చూసే వీలుంది. వేసవి కాలంలో రాత్రి సమయంలో ఆకాశం వైపు చూస్తుంటే మిణుకు మిణుకుమనే నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అవన్నీ భూమికి ఎన్నో కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి.

PM MODI: సికింద్రాబాద్ నుంచి మోడీ.. మెదక్ నుంచి సోనియా.. అగ్రనేతలిద్దరూ తెలంగాణ నుంచే పోటీ?

అంతరిక్షంలో అనేక గ్రహ శకలాలు కూడా ప్రయాణిస్తుంటాయి. అందులో కొన్ని భూమికి దగ్గరగా కూడా వస్తుంటాయి. కానీ అవేవీ మన కంటికి కనిపించవు. కానీ.. వాటి శకలాలు కొన్ని భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మిరిమిట్లు గొలిపే కాంతి వెదజల్లుతూ మండిపోతాయి. వీటిని ఉల్కాపాతం అంటారు. అయితే, ఇలాంటివి చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి. ఈ నెలలో ఉల్కాపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన ఉల్కాపాతం ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. తోకచుక్కలు.. వాయువులు, ధూళితో పాటు వివిధ పరిమాణాల్లో ఉన్న శకలాల్ని వెదజల్లుతుంటాయి. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉల్కాపాతాలు ఏర్పడతాయి.

PAWAN KALYAN: పవన్ తెలిసి తప్పు చేస్తున్నాడా? లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ వెళ్లడమేంటి..?

వీటిని షూటింగ్‌ స్టార్స్‌ అని కూడా పిలుస్తుంటారు. పచ్చని వెలుగుతో ప్రయాణిస్తున్న 46P విర్టానన్‌ తోకచుక్క వల్ల ప్రస్తుతం ఉల్కపాతం ఏర్పడుతోంది. ఇది గురు గ్రహ కుటుంబానికి చెందినది. అంటే, దీని కక్ష్య సూర్యుడికి, గురు గ్రహానికి మధ్య ఉంది. గతంలో 2007లో ఒక సారి… తర్వాత 2018లో మరోసారి 46P విర్టానన్‌ తోకచుక్క శకలాల వల్ల ఉల్కపాతం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పట్లో సంభవించిన ఉల్కపాతం చాలా తక్కువ అంటున్నారు. అందువల్ల పరిశీలన రాడార్లు మాత్రమే వాటిని గుర్తించగలిగాయి. ఈ సారి మాత్రం ఉల్కాపాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి గంటకు రెండు నుంచి పది ఉల్కలు కనిపించొచ్చని అంచనా వేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత ఉల్కపాతాన్ని చూడొచ్చు. అది కూడా సాధారణ కంటితో చూసే వీలుంది ఉంది.

అయితే, బైనాకులర్స్‌ గాని, టెలిస్కోపును గాని ఉపయోగిస్తే మరింత స్పష్టంగా ఉల్కపాతాన్ని చూడొచ్చంటున్నారు నిపుణులు. ఉల్కపాతాలను చూసిన వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసి తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని ఇంటర్నేషనల్‌ మీట్యుర్‌ ఆర్గనైజేషన్‌-IMO తెలిపింది.