శేషాచలం అడవుల్లో బంగారు బల్లి…

ప్రకృతి వైపరిత్యాలో, మానవ జాతి తప్పిదాలో, కాలుష్య ప్రభావమో గాని అరుదైన జంతు జాతులు మన అడవుల్లో అంతరించిపోతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 6, 2024 / 05:30 PM IST

ప్రకృతి వైపరిత్యాలో, మానవ జాతి తప్పిదాలో, కాలుష్య ప్రభావమో గాని అరుదైన జంతు జాతులు మన అడవుల్లో అంతరించిపోతున్నాయి. మన ముత్తాతలు చూసిన వాటిని తాతలు చూడలేదు… తాతలు చూసిన వాటిని నాన్నలు చూడలేదు… నాన్నలు చూసిన వాటిని మనం చూడలేకపోయాం… తర్వాతి తరాలు చూడటానికి ఏం మిగిలే అవకాశం కూడా కనపడటం లేదు. అందుకే విదేశాల నుంచి జంతువులను దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొన్నాళ్ళుగా కొన్ని జంతువులు కనుమరుగు అయ్యాయి.

ఇటీవల నల్లమల అడవుల్లో ఒక అడవి దున్నను చాన్నాళ్ళ తర్వాత అటవీ సిబ్బంది గుర్తించారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో అడవి జీవి మనకు కనపడింది. శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లిని గుర్తించారు. వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్లకు బంగారు బల్లి కనపడింది. అటవీ శాఖ షెడ్యూల్ 1 కింద పరిగణించే బంగారు బల్లి… కేవలం చీకటి ప్రదేశాల్లో అలాగే… రాతి బండల్లో నివాసం ఉంటుంది. అచ్చు బంగారం రంగులోనే ఉంటూ కనువిందు చేస్తుంది ఈ బల్లి. ఇటీవలి కాలంలో దీని జాడ ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు కల్యాణి డ్యాం పరిధిలో వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ల కంట పడింది.