Google Banned13 Apps : మొబైల్స్ లో డేటాను దొంగిలిస్తున్న 13 ఆండ్రాయిడ్ యాప్స్‌ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. మొత్తం 25 యాప్స్ లో Xamalicious అనే మాల్వేర్ ఉన్నట్టు… ఈమధ్యే మెక్అఫీ మొబైల్ రీసెర్చ్ టీమ్ గుర్తించింది. వాటిల్లో కొన్ని యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నట్టు తెలిపింది. ఈ డేటా రిలీజ్ అయిన తరువాత కస్టమర్ల డేటా భద్రతను దృష్టిలో పెట్టుకుని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
Xamalicious అంటే Xamarin అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన మాల్వేర్ అని మెక్అఫీ మొబైల్ రిసెర్చ్ టీమ్ చెబుతోంది. Xamalicious చేసే మోసాలను టీమ్ బయటపెట్టింది. ‘Xamalicious బారిన పడిన యాప్‌లు యూజర్ల ఖాతాలను యాక్సెస్ చేస్తాయి. దాంతో ఆ మొబైల్ ను వాడే వినియోగదారుడికి తెలియకుండా కమాండ్-అండ్-కంట్రోల్ సర్వర్‌తో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత సర్వర్, మొబైల్లో రెండో పేలోడ్ (మాల్వేర్)ను ఇన్స్టాల్ చేస్తుంది. ఆ తర్వాత యూజర్ మొబైల్ సర్వర్ సైబర్ క్రిమినల్స్ కంట్రోల్లోకి వెళ్తుంది. అప్పటి నుంచి యాజర్‌కు తెలియకుండా యాడ్స్ క్లిక్ చేయడం, ఇతర యాప్‌లను ఇన్స్టాల్ చేయడం లాంటివి కు ఆ మాల్వేర్ తో ఆటోమేటిగ్గా జరిగిపోతాయని రీసెర్చ్ టీమ్ చెబుతోంది.
ప్రపంచంలో ఈ యాప్స్‌ని లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. ఒకవేళ మీరు కూడా డౌన్‌లోడ్ చేస్తే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసేసినా మీ మొబైల్ ఇప్పటికే డౌన్ లోడ్ చేసి ఉంటే అవి డిలీట్ కావు.
గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ ఏవంటే :