Android phone Earthquake : ఇక మీ ఆండ్రాయిడ్ ఫోన్ కే భూకంప హెచ్చరికలు..

మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం గూగుల్ తన భూకంప హెచ్చరిక వ్యవస్థను చేస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్‌ ఫోన్ లో భూకంప హెచ్చరికను చెప్పె ఫీచర్ ను పొందుపరుస్తుంది. ఇది ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది,

ఫోన్.. ఈ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని చుట్టేయవచ్చు.. మన గతంలో ఫోన్ గురించి.. దాని విలువ గురించి వాటి ఉపయోగాల గురించి తెలుసుకున్నాం.. వాటి నుంచి కలిగే దురుపయోగాలు కూడా చాలానే ఉన్నాయి. మీకు తెలుసా.. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ప్రకృతి ముప్పు నుండి మన ప్రాణాలు రక్షించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇది చదివేయండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఈ ఫోన్ తెలియని వారు.. ప్రస్తుతం ఉపయోగించని వారు ఉండరు. చదువుకున్న వారి నుంచి చదువు అభ్యసించిన వారు సైతం ఈ ఫోన్స్ ను తేగ వాడుస్తున్నారు అనుకోండి. ఒకడు పదో తరగతి కూడా పాస్ కాలేదు వాడి చేతిలో కూడా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. మరి ఇంతలా ఎందుకు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ గురించి చెప్తున్నాను అంటే.. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ మన ప్రాణాలు పోకుండా మనకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అదే లేండి భారతదేశంలో అప్పుడప్పుడు అరుదుగా వచ్చే భూకంపాల దాటి నుంచి ఈ ఫోన్ మనను కాపాడుతుంది. మరి ఎలా కాపాడుతుందో చూద్దాం రండి.

మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం గూగుల్ తన భూకంప హెచ్చరిక వ్యవస్థను చేస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్‌ ఫోన్ లో భూకంప హెచ్చరికను చెప్పె ఫీచర్ ను పొందుపరుస్తుంది. ఇది ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. భూకంపం సంభవించే ముందు వారికి ఈ ఫోన్ ద్వారా తెలియజేస్తుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC) సహకారంతో Google భారతదేశంలో Android భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రవేశపెట్టింది.

ఫోన్ నుంచి అలర్ట్ రావాలంటే.. ఏం చేయాలి..?

భారతదేశంలో ఆండ్రాయిడ్ 5 ఫోన్స్.. అంతకంటే తక్కువ ఉన్న ఫోన్లు వాడే వాళ్ళ ప్రస్తుత జనరేషంలో చాలానే ఉన్నారు. మన ఫోన్ లో అలర్ట్ రావాలంటే ఫోన్ లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్, లోకేషన్ ఎప్పుడు కూడా ఆన్ లో ఉండే విధంగా చూసుకోవాలి. ఫోన్ లో ఎర్త్ క్వేక్ అలర్ట్ సెట్టింగ్ ఆన్ లో ఉంచి.. సెట్టింగ్స్ కి వెళ్లి సేప్టి అండ్ ఎమర్జెన్సీ ట్యాప్ చేసి.. ఎర్త్ క్వేక్ అలర్ట్స్ మీద ట్యాప్ చేయాలి. ఒకనొక సమయంలో సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ కనిపించకపోతే లొకేషన్ మీద ట్యాప్ చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత అడ్వాన్స్డ్, ఎర్త్ క్వేక్ అలర్ట్ ఆప్షన్ ని ఆన్ చేయాలి. ఆ అలర్ట్ లు అన్ని రాష్ట్రాల ప్రధాన భాషల రూపంలో భారతీయ భాషలు ఉంటాయి.

ఆండ్రాయిడ్ ఫోన్ భూకంప హెచ్చరికను ఎలా పసిగడుతుంది..?

ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జింగ్ తీసుకుంటున్న సమయంలో అది భూకంపం యొక్క మొదటి వైబ్రేషన్‌లను గమనించినప్పుడు డేటాను సెంట్రల్ సర్వర్‌కు పంపుతుంది. ఒకే లొకేషన్‌లోని అనేక ఫోన్‌లు ఇలాంటి వైబ్రెషన్ లు, కదలికలు వచ్చే సర్వర్ భూకంపం యొక్క లక్షణాలను, దాని భూకంప కేంద్రం పరిమాణంతో సహా గుర్తిస్తుంది. ఇది అక్కడే ఉన్న మిగత ఆండ్రాయిర్ ఫోన్ పరికరాలకు ఈ మెసేజ్ హెచ్చరికలను పంపుతుంది.

భూకంప తీవ్రతను బట్టి రెండు రకాలుగా హెచ్చరికలు..

దీనిలో భూకంపం పరిమాణాన్ని మాగ్నిట్యూడ్ బట్టి రెండు రకాల అలర్ట్ లు కంపనాల తీవ్రత చెప్తుంది. ఎంఎంబ 3, 4 షేకింగ్, 4.5 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం ఉంటే ‘బీ అవేర్ అలర్ట్’ అని మెసేజ్ వస్తుంది. రెండోది ఎంఎంఐ 5 షేకింగ్, 4.5 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం. ఉంటే ‘టేక్ యాక్షన్ అలర్ట్’ అని మెసేజ్ వస్తుంది. ఎక్కువ ఉన్న పోస్టులు వాడేవాళ్లకు అందుబాటులోకి వస్తుంది. అలర్ట్ రావాలంటే ఫోన్ లో ఇంటర్నెట్ కనెక్షన్, లొకేషన్ సెట్టింగ్స్ తప్పని సరిగ్గా ఆన్ లో ఉండాలి.

ఈ రకమైన వ్యవస్థ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే చాలా వరకు ప్రకృతి నుంచి వచ్చే భూకంప లాంటి వైపరిత్యాల నుంచి ఎంతో కొంత మేర రక్షణ పోందోచ్చు. ఇది వరకు ఈ వ్యవస్థ లేకపోవడంతో తాజాగా.. ఉత్తర ఆఫ్రికా దేశం లోని మొరాకో.. ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం వల్ల వేలాది మంది మృత్యువాత చెందారు.

S.SURESH