Bharat Atta: కేంద్ర కొత్త పథకం భారత్ ఆటా.. తక్కువ ధరకే గోధుమ పిండి.. కేజీ ధర ఎంతంటే..

దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 700 మొబైల్ వ్యాన్లు, 2,000కు పైగా ఉన్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు, సొసైటీలు, మదర్ డైరీ ఔట్‌లెట్ల ద్వారా ఈ గోధుమ పిండిని అందిస్తారు. ఈ నిర్ణయం పౌరులపై ఉన్న అధిక ధరల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కేంద్రం తెలిపింది.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 08:07 PM IST

Bharat Atta: దేశంలో పెరిగిపోతున్న ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. సామాన్యులకు తక్కువ ధరకే నిత్యావసరాలు అందేలా కృషి చేస్తుంది. తాజాగా దేశంలోని సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా (Bharat Atta) పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం తక్కువ ధరకే గోధుమ పిండి (atta)ని అందుబాటులోకి తేనుంది. రూ.27.50లకే కేజీ గోధుమ పిండి అందివ్వనుంది. పది కేజీలు, ముప్పై కేజీల బ్యాగ్స్‌లో ఈ పిండి అందుబాటులోకి వస్తుంది.

YS SHARMILA: షర్మిల గోబ్యాక్.. ఆంధ్రాకు వెళ్ళిపో.. వైఎస్సార్టీపీ నేతల తిరుగుబాటు!!

దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 700 మొబైల్ వ్యాన్లు, 2,000కు పైగా ఉన్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు, సొసైటీలు, మదర్ డైరీ ఔట్‌లెట్ల ద్వారా ఈ గోధుమ పిండిని అందిస్తారు. ఈ నిర్ణయం పౌరులపై ఉన్న అధిక ధరల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో సగటున కిలో గోధుమ పిండి ధర నాణ్యతను బట్టి రూ.36-70 వరకు ఉంది. కాగా, సోమవారం కర్తవ్య పథ్‌ వద్ద ‘భారత్‌ ఆటా’కు సంబంధించిన 100 మొబైల్‌ వ్యాన్లను కేంద్ర మంత్రి గోయల్‌ (Piyush Goyal) జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ గోధుమ పిండి అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి గోధుమలు సేకరిస్తుంది అనే సంగతి తెలిసిందే. అలా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ప్రభుత్వం కేంద్ర సంస్థలకు రూ.21.50కి అందజేసింది. వీటిని పిండిగా మార్చి, ఆయా సంస్థలు రూ.27.50కి విక్రయిస్తాయి. ధరల స్థిరీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుంది.

Sara Tendulkar: డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డ మరో సెలబ్రిటీ జంట.. మార్ఫింగ్‌ ఫొటో వైరల్‌..

ఇటీవలే కేంద్రం భారత్ దాల్ అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కేజీ శనగ పప్పును కేంద్రం రూ.60కే అందిస్తోంది. అదే 30 కేజీల బ్యాగ్ తీసుకుంటే.. కేజీ రూ.55కే దొరుకుతుంది. ఇప్పటికే ఉల్లిగడ్డల్ని కేంద్రం కొన్నిచోట్ల రూ.25కే అందిస్తోంది. ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉల్లి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగినందువల్ల కేంద్రం ఈ చర్య తీసుకుంది. గతంలో టమాటాల్ని కూడా ఇలా తక్కువ ధరకే అందించామని కేంద్రం తెలిపింది.