దేశంలోని 5 ప్రముఖ శైవక్షేత్రాల చరిత్ర

భారత దేశంలో ఐదు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దేవాలయాలన్నీ గీత గీసినట్లు ఒకలైన్ లో నిర్మించబడ్డాయి. దీన్నే శివ అక్ష రేఖ అని పిలుస్తారు.

  • Written By:
  • Publish Date - November 15, 2024 / 06:40 PM IST

భారత దేశంలో ఐదు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దేవాలయాలన్నీ గీత గీసినట్లు ఒకలైన్ లో నిర్మించబడ్డాయి. దీన్నే శివ అక్ష రేఖ అని పిలుస్తారు. ఈ ఐదు దేవాలయాలు…దక్షిణాదిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలిశాయి. పంచ భూతాలను ప్రతిబింబించేలా మందిరాలను నిర్మించారు. అవేటంటే ఆకాశం, అగ్గి, నీళ్లు, గాలి, భూమి. ఈ ఐదు శివాలయాలు…బౌగోళికంగా 79 డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే…శివ అక్ష రేఖకు…ఉత్తరాన కేదార్నాథ్ ఆలయం, దక్షిణాన రామేశ్వరం టెంపుల్ ఉన్నాయి. ఇవి రెండు కూడా గీత గీసినట్లు…ఒక వైఫు కేదార్నాథ్…ఇంకో వైపు రామేశ్వరం ఉన్నాయి. తిల్లయ్ నటరాజ ఆలయం..తమిళనాడులోని చిదంబరంలో ఉంది. ఇది పంచభూతాల్లోని ఆకాశం సింబల్ ను ప్రతిబింబిస్తుంది. అన్నామలయ్యర్ టెంపుల్…అగ్గికి ప్రతిరూపం. ఇది అన్నామలయ్యర్ కొండల్లో ఉంది. మరోకటి జంబుకేశ్వర్ ఆలయం. ఇది తమిళనాడులోని త్రిరుచారాపల్లిలో వెలసింది. ఇది పంచభూతాల్లో నీళ్లకు ప్రతిరూపం. శ్రీకాళహస్తి టెంపుల్…ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాళహస్తిలో ఉంది. ఇది గాలికి ప్రతిరూపం నిర్మాణం జరిగింది. చివరిది కాళేశ్వర్ ఆలయం. ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంలో ఉంది. ఇది భూమికి ప్రతిరూపం అని శాస్త్రాల్లో చెప్పారు. కేదార్నాథ్ ఆలయం అయినా…రామేశ్వరం ఆలయం అయినా…రెండు 79 డిగ్రీల రేఖాంశంలో నిర్మించారు. ఎవరు ఊహించలేని విధంగా శతాబ్దాల క్రితమే…ఈ ఆలయాలను అడ్వాన్స్ టెక్నాలజీని ఇండియన్స్ ఉపయోగించారు. సైన్స్, టెక్నాలజీ, అధ్యాత్మికం, వాస్తుశిల్పంలో…భారత్ మూడో స్థానంలో ఉంది.

చిదంబరం ఆలయంలో అంతరిక్షం, తిరువణ్ణామలైలో అగ్ని, తిల్లయ్ ఆలయంలో నీరు, కాళహస్తిలో గాలి, కాళేశ్వర్ ఆలయం భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. యోగా సైన్స్‌కు అనుగుణంగా నిర్మించబడిన ఈ దేవాలయాల భౌగోళికంగా నిర్మించిన విధానం చూస్తే…మైండ్ బ్లాంక్ అవుతంది. ఇది మానవ శరీరాన్ని సమర్థవంతంగా ప్రభావితం చేస్తుంది. కేదార్‌నాథ్- రామేశ్వరం మధ్య 2383 కి.మీ దూరం ఉన్నప్పటికీ, ఈ ఆలయాలన్నీ దాదాపు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయాలను ఇంత అలైన్‌మెంట్‌లో నిర్మించడానికి ఉపయోగించిన సాంకేతికత మిస్టరీగా మిగిలిపోయింది. వాయు లింగాన్ని సూచించే శ్రీకాళహస్తిలో మెరిసే దీపం వంటి ప్రతి ఆలయంలో నిర్దిష్ట మూలకాల ఉనికి, సంబంధిత అంశాలతో వాటి అనుబంధాన్ని మరింత హైలైట్ చేస్తుంది.