Users WhatsApp Block : ఇలా చేశారంటే మీ వాట్సాప్‌ బ్లాక్‌.. జీవితంలో మళ్లీ వాడలేరు..

యూజర్స్‌ ఇన్ఫర్మేషన్‌ కాన్ఫిడెన్షియల్‌ (Users' information is confidential) గా ఉంచడంలో నెంబర్‌ వన్‌గా ఉండే వాట్సాప్‌ భారీ యాక్షన్‌ తీసుకుంది. వాట్సాప్‌ (WhatsApp) నిబంధనలతో పాటు దేశ చట్టాలు మీరుతున్న 2 కోట్ల మంది యూజర్స్‌ అకౌంట్స్‌ బ్లాక్‌ చేసింది. ఈ మేరకు ఓ అధికారికి రిపోర్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది వాట్సాప్‌.

యూజర్స్‌ ఇన్ఫర్మేషన్‌ కాన్ఫిడెన్షియల్‌ (Users’ information is confidential) గా ఉంచడంలో నెంబర్‌ వన్‌గా ఉండే వాట్సాప్‌ భారీ యాక్షన్‌ తీసుకుంది. వాట్సాప్‌ (WhatsApp) నిబంధనలతో పాటు దేశ చట్టాలు మీరుతున్న 2 కోట్ల మంది యూజర్స్‌ అకౌంట్స్‌ బ్లాక్‌ చేసింది. ఈ మేరకు ఓ అధికారికి రిపోర్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది వాట్సాప్‌. తమ రివ్యూలో ఎర్రర్‌ కనిపించిన ప్రతీ అకౌంట్‌ను బ్లాక్‌ చేస్తామని వివరించింది. 2023లో కూడా ఇలాగే భారీ సంఖ్యలో అకౌంట్లను బ్లాక్‌ చేసింది. గతేడాది ఏకంగా 79 లక్షల అకౌంట్లు బ్లాక్‌ చేసింది. అప్పటితే కంపేర్‌ చేస్తే ఇప్పుడు ఈ అకౌంట్స్‌ సంఖ్య రెట్టింపు కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ముందు నుంచీ ప్రైవసీ విషయంలో వాట్సాప్‌ తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుంది. మెసేజింగ్‌ నుంచి కాలింగ్‌ వరకూ అంతా ఎండ్ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయ్యి ఉంటంది. ఈ కారణంగానే చాలా మంది వాట్సాప్‌ సేఫ్‌ యాప్‌గా ఫీలవుతుంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాట్సాప్‌లో కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటున్నాయి. ఫేక్‌ సమాచారా వాట్సాప్‌లో వ్యాపించడం. వాట్సాప్‌ గ్రూపు (WhatsApp Groups) ల్లో కొందరు ఇల్లీగల్‌ పనులు చేయడం లాంటి ఘటన ప్రతీ రోజు వేల సంఖ్యలో బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి అకౌంట్లనే ఇప్పుడు వాట్సాప్‌ రివ్యూ చేస్తోంది.

యాప్‌ ఇన్‌స్టాల్‌ (App Install) చేసే సమయంలో కొన్ని నిబంధనలు వాట్సాప్‌ చూపిస్తుంది. వాటికి అనుగుణంగా వాడివాళ్ల అకౌంట్లను మాత్రమే మెటా కంటిన్యూ చేస్తుంది. నిబంధనలు మీరినవాళ్ల అకౌంట్లను బ్లాక్‌ చేస్తుంది. ఈ రివ్యూ ప్రతీ ఏడాది చేస్తోంది వాట్సాప్‌. రిపోర్ట్‌ వచ్చిన అకౌంట్స్‌.. తమ రివ్యూల్లో నిబంధనలు మీరిన అకౌంట్స్‌ సెకండ్‌ ఆప్షన్‌ లేకుండా బ్లాక్‌ చేస్తోంది. ఈసారి ఏకంగా 2 కోట్ల అకౌంట్స్‌ను బ్లాక్‌ చేసింది అంటే.. వాట్సాప్‌ను ఎంత మంది తప్పుడు పనులకు వాడుకుంటున్నారు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.