షవర్మ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది.. స్నాక్స్ అనుకునే స్టార్ట్ చేసి.. మెయిన్ కోర్స్ లెవల్‌లో తినేవాళ్లు ఎందరో ! ఈ షవర్మకు యూత్‌లో చాలామందికి ఫేవరెట్ ఫుడ్ కూడా ! ఐతే ముంబైలో జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. షవర్మ ముట్టుకోవాలంటేనే భయపడతారు. ఓ యువకుడి ప్రాణం తీసింది షవర్మ (Chicken Shawarma). పాడయిపోయిన చికెన్‌తో చేసిన షవర్మ తిని.. ముంబై (Mumbai) లో ఓ యువకుడు చనిపోయాడు. ఆ షాప్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షవర్మ తిన్న మరో ఐదుగురు.. ఫుడ్ పాయిజన్ (Food poisoning) తో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మే 3న ప్రథమేశ్ భోక్సే అనే యువకుడు.. స్నేహితులతో కలిసి చికెన్ షవర్మ తిని ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత రోజు నుంచి కడుపునొప్పి, విపరీతంగా వాంతులు కావడంతో.. ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయానికి ఏదో ట్రీట్‌మెంట్ చేసి డాక్టర్.. ఆ యువకున్ని ఇంటికి పంపించినా.. మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స తీసుకుంటూ ఆ యువకుడు ప్రాణాలు వదిలేశాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షవర్మ అంటేనే భయం పుట్టేలా చేస్తోంది. ఔట్ సైడ్ ఫుడ్ ఎప్పుడైనా డేంజరే.. ఎలాంటి నూనెలు వాడతారో.. పదార్థాలు వాడతారో చెప్పలేం. బయట ఫుడ్‌కు దూరంగా ఉండడమే బెటర్ అంటూ డాక్టర్లు సూచిస్తున్నారు. ఐతే షవర్మ తిని చనిపోయిన ఈ న్యూస్‌ను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.