Swiggy-Biryani: బిర్యానీకి మరోసారి హైదరాబాదీల ఫిదా.. స్విగ్గీలో రోజుకు 21 వేల బిర్యానీ ఆర్డర్లు

ఈ సంవత్సరం సగటున 1 సెకన్‌కు 2.5 బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. జనవరి నెలలో ఏకంగా నాలుగు లక్షల 30 వేల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 23 వరకు 2.49 మిలియన్ల మంది కస్టమర్లు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశారు.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 03:35 PM IST

Swiggy-Biryani: హైదరాబాదీల ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. ఈ విషయం మరోసారి రుజువైంది. స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్లు రోజూ వేలల్లో వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లో సగటున ప్రతిరోజూ 21 వేల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ ఏడాదికి సంబంధించి స్విగ్గీలో నమోదైన ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్లకు సంబంధించిన రిపోర్టును ‘హౌ ఇండియా స్విగ్గిడ్‌-2023’ పేరుతో స్విగ్గీ వెల్లడించింది. దీని ప్రకారం.. స్విగ్గీలో ఎక్కువ మంది కస్టమర్లు బిర్యానీనే ఆర్డర్‌ చేశారని తెలిపింది.

YS JAGAN: వైసీపీకి దూరమవుతున్న రెడ్లు.. బీసీ ఓట్ బ్యాంక్‌పై జగన్ నజర్..

ఈ సంవత్సరం సగటున 1 సెకన్‌కు 2.5 బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. జనవరి నెలలో ఏకంగా నాలుగు లక్షల 30 వేల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 23 వరకు 2.49 మిలియన్ల మంది కస్టమర్లు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశారు. హైదరాబాద్‌కు సంబంధించి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో ఎన్నికలు రావడంతో ఆర్డర్లు రెట్టింపయ్యాయి. స్విగ్గీలోని ప్రతి 6 ఆర్డర్లలో ఒకటి బిర్యానీ ఉంది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్‌ చేయడం విశేషం. హైదరాబాద్‌లోనే మరో కస్టమర్ ఏకంగా రూ.6 లక్షల విలువైన, 8428 ప్లేట్ల ఇడ్లీలు ఆర్డర్‌ చేశాడు. హైదరాబాద్‌లో ప్రతి నిమిషానికి 15 బిర్యానీలు, గంటకు 900 బిర్యానీలు, సగటున రోజుకు 21,600 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. స్విగ్గీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు నేరుగా వచ్చే కస్టమర్స్‌ కంటే ఫుడ్‌ యాప్‌ ఆర్డర్ల ద్వారానే ఆదాయం ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది.

బిర్యానీల్లో హైదరాబాదీ బిర్యానీకి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఢిల్లీ, చెన్నైలో కూడా సంవత్సరానికి 10వేల కంటే ఎక్కువగా హైదరాబాద్ బిర్యానికి ఆర్డర్లు వచ్చాయి. ముంబైకి చెందిన ఒక కస్టమర్ ఏకంగా రూ.42.3 లక్షల విలువైన బిర్యానీ ఆర్డర్లు ఇచ్చారు. మరో యూజర్ ఒకే రోజు 207 పిజ్జాలను ఆర్డర్ చేశాడు. ఫిబ్రవరి 14వ తేదీన వేలంటైన్స్ డే నాడు ప్రతి నిమిషానికీ 271 కేకుల ఆర్డర్లు స్విగ్గికి అందాయి. ఏదేమైనా.. ఎప్పట్లాగే ఆన్‌లైన్ ఆర్డర్లలో బిర్యానీ టాప్‌లో ఉంది.