INDIA TRAVEL: రైలు ప్రయాణాలంటే ఇష్టమా.. ఇండియాలో బెస్ట్ ట్రైన్ జర్నీస్ ఇవే..

ముంబై నుంచి గోవా.. లేదా గోవా నుంచి ముంబై ట్రైన్ జర్నీ చేస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. కొంకణ్ రైల్వేస్ అందిస్తున్న ఈ ట్రైన్ జర్నీలో ఎన్నో సుందరమైన, ప్రాకృతిక ప్రదేశాల్ని చూడొచ్చు.

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 06:23 PM IST

INDIA TRAVEL: రైలు ప్రయాణాలంటే కొందరికి చాలా ఇష్టం. రైళ్లలో ప్రయాణిస్తూ, దేశంలోని పర్యాటక ప్రదేశాల్ని సందర్శించడాన్ని ఆస్వాదిస్తుంటారు. అలాంటివాళ్ల కోసం ఇప్పుడు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్పెషల్ ప్యాకేజీలు అందిస్తోంది. రైళ్లలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తూ, కావాల్సిన చోటుకు తీసుకెళ్లి, మళ్లీ మీ గమ్య స్థానానికి చేర్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఉత్తర భారత దేశానికి సంబంధించిన అలాంటి కొన్ని బెస్ట్ రైల్వే ప్రయాణాలివి.

INDIA TRAVEL: వసంత కాలం.. ఈ సీజన్‌లో ఇండియాలో చూడదగ్గ ప్రదేశాలివే..
ముంబై టు గోవా
ముంబై నుంచి గోవా.. లేదా గోవా నుంచి ముంబై ట్రైన్ జర్నీ చేస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. కొంకణ్ రైల్వేస్ అందిస్తున్న ఈ ట్రైన్ జర్నీలో ఎన్నో సుందరమైన, ప్రాకృతిక ప్రదేశాల్ని చూడొచ్చు. సహ్యాద్రి హిల్స్, అరేబియా సముద్రం, పచ్చని చెట్లు, కొబ్బరి తోటలు, కొండల మధ్య నుంచి రైలు ప్రయాణం సాగుతుంది. రెండు కొండలమధ్య ఏర్పాటు చేసిన బ్రిడ్జి మీద నుంచి రైలు ప్రయాణిస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. ఇక వర్షాకాలంలో అనేక పెద్ద, చిన్న జలపాతాలు కనువిందు చేస్తాయి. సముద్రం, ఇసుక, సూర్యుడు.. వీటిని ఆస్వాదించాలంటే ఈ ట్రైన జర్నీ బెస్ట్. బడ్జెట్‌లోనే ఉంటుంది.
కాల్కా టు షిమ్లా
హిమాలయన్ క్వీన్ ట్రైన్‌లో సాగే కాల్కా టు షిమ్లా జర్నీ పర్యాటకులకు మంచి అనుభూతిని మిగులుస్తుంది. దాదాపు 96 కిలోమీటర్ల మేరసాగే రైలు ప్రయాణంలో అందమైన పర్వతాలు, పైన్ చెట్లు, లోయలు, పాలధారను తలపించేలా ఉన్న జలపాతాలు, చుట్టూ పచ్చదనం కనువిందు చేస్తుంది. ఈ రైలు మార్గంలో మొత్తం 864 బ్రిడ్జిలు, 102 టన్నెల్స్, 919 వంపులు ఉంటాయంటే ఈ రైలు ప్రయాణం ఎంతటి మధురానుభూతిని అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఇది మీ బెస్ట్ రైల్ జర్నీల్లో ఒకటిగా మిగులుతుంది. ప్రపంచంలో అత్యంత నిటారైన రైలు మార్గం ఇదే.
జైసల్మేర్ టు జోధ్‌పూర్
రాజస్తాన్ అంటేనే ఎడారి ప్రాంతం. అయితేనేం.. పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. రాజస్థాన్‌‌లోని జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వరకు సాగే సర్ట్ క్వీన్ రైలు ప్రయాణం ఎడారి ప్రాంతాల్ని విజిట్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్. ఈ రైలు ప్రయాణ మార్గంలో కనిపించే మొక్కలు, బంగారు రంగులో ఉండే ఇసుక తిన్నెలు, ఒంటెలు, లేళ్లు సహా అనేక అడవి జంతువులు కనిపిస్తాయి. ఇదొక డిసర్ట్ సఫారిగా చెప్పొచ్చు.
రణతంబోర్ టైగర్ రిజర్వ్
ఇది సవాయి మాధోపూర్ జిల్లాలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతం. దేశంలోనే ప్రముఖమైన టైగర్ రిజర్వ్‌లలో ఒకటి. ఇక్కడ పులులను చూడొచ్చు. అలాగే యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్ని కూడా చూసి ఆస్వాదించే వీలుంది. ఈ రణతంబోర్ టైగర్ రిజర్వ్‌ పరిధిలోనే ఒక పురాతన కోట ఉంది. దగ్గర్లోనే పాదం అనే సరస్సు ఉంది. ఈ సరస్సులో రకరకాల అందమైన పక్షులను చూడొచ్చు. ఈ రణతంబోర్ టైగర్వ్ రిజర్వ్‌ చూడాలనుకుంటే మీరు సవాయి మాధోపూర్ వరకు రైలులో వెళ్లొచ్చు. ఈ రైలు ప్రయాణం కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది.