భారతదేశపు అత్యంత పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియా పోస్ట్. కొన్ని దశాబ్దాల క్రితం దూరప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు కుశల సంభాషణను ఉత్తరాల ద్వారా చేరవేసే ఒక సేవారంగం. ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉత్తరాలను అందివ్వడమే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థకూడా అభివృద్ది చెందింది. క్రమక్రమంగా తన సేవలను విస్తరిస్తూ ప్రజల డబ్బును ఖాతా తెరిచి పొదుపు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అందులోనూ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లకంటే అత్యధికంగా వడ్డీరేట్టు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్లను చేయించుకుంటుంది. అన్ని రకాలా బ్యాంకింగ్ సంస్థలకన్నా అత్యధికంగా వడ్డీ రేటు ఇచ్చే ఏకైక సంస్థ భారతీయ డాక్ ఘర్. దీనికి గత కొన్ని సంవత్సరాలుగా ఏటీఎం సదుపాయం కూడా కల్పించింది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
సామాన్యుడు రెక్కలు ముక్కలు చేసుకొని కొంతో గొప్పో ధనం కూడబెట్టుకోవాలని అనుకుంటాడు. తమ ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్ కోసం, కూతురు పెళ్ళికోసం ఇలా రకరకాలా కారణాల చేత చేతిలోని నగదును పోస్టాఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లబ్ధిపొందాలనుకుంటాడు. ఇక వడ్డీ రేట్ల విషయానికొస్తే గతంలో సీనియర్ సిటిజన్స్ కి 7 శాతం తగ్గకుండా ఉండేది. కానీ ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కు రెపోరేటును 8శాతానికి పెంచుతూ కీలకనిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పోస్టల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం డిపాజిట్లు ఉన్నవారికి ఆర్థికంగా మంచి ప్రయోజనం చేకూరిందని చెప్పాలి. ప్రస్తుతం డిపాజిట్ చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే.
ప్రతినెలా ఆదాయం వచ్చే స్కీమ్:
పోస్టల్ లో ఆదాయం ఇచ్చే మరో గొప్ప పథకం పోస్టాఫీస్ మంథ్లీ ఇన్ కం స్కీమ్. గతంలో దీనిపై వడ్డీ రేటు 6.7 శాతం ఉండేది. అయితే ప్రస్తుతం 7.1కి పెంచాలని నిర్ణయం తీసుకుంది పోస్టల్ శాఖ. ఈ ఖాతాను తెరవాలంటే కనీసం వెయ్యి రూపాయలు మినిమం అమౌంటును చెల్లించాలి. ఈ ఖాతాలో జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకూ డిపాజిట్ చేయవచ్చు. అదే సింగల్ ఖాతా అయితే గరిష్టంగా నాలుగున్నార లక్షల వరకూ పొదుపు చేయవచ్చు. పొదుపు చేసిన మొదటి రోజునుంచి ఆ బాండు మెర్చురిటీ తేది వరకూ ప్రతిమాసంలో ఆఖరి రోజున వడ్డీ చెల్లిస్తారు. వడ్డీతో కూడిన మొత్తం డబ్బును అసలుతో సహా కాలపరిమితి తరువాత ఉపసంహరించుకోవచ్చు.
ఆదాయంలో పన్ను మినహాయింపు:
పోస్టాఫీసులో పొదుపు చేసే వాటిలో గొప్ప పథకం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్. ఇందులో నాలుగురకాలా పాలసీలు ఉంటాయి. కనిష్టంగా సంవత్సరం నుంచి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకూ ఉంటుంది. ఇందులో కూడా అకౌంట్ ఓపెనింగ్ కి వెయ్యి రూపాయలు చెల్లించాలి. గరిష్ట పరిమితి ఏమీ చెప్పలేదు. ఈ మూడునెలల తరువాత గతంలో ఉన్న వడ్డీరేటు 6.9 నుంచి 7శాతానికి పెరుగుతుంది. దీనికి 1961 ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 80సీ కింద 60 సంవత్సరాలు దాటిన వారికి 5 సంవత్సరాల పథకంలో ట్యాక్స్ మినహాయింపు కూడా వర్తిస్తుంది.
బ్యాంకు ప్రామిసింగ్ వల్ల లోన్ సౌకర్యం:
ఇప్పుడు చెప్పే పథకంలో లోన్ కూడా పోందే సదుపాయాన్ని కల్పించింది. ఆ పథకం పేరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఇందులో జనవరి నుంచి మార్చి వరకూ మూడు నెలల కాలానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 6.8 ఉండగా ప్రస్తుతం 7 శాతానికి పెరిగింది. ఇందులో ఖాతా తెరిచేందుకు కనీసం రూ.1000 చెల్లించ వలసి ఉంటుంది. పోదుపు చేసిన రోజునుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితిలో మెచ్యూరిటీకి చేరుకుంటుంది. ఈ పథకంలోని పెట్టుబడిదారుడు తమ పెట్టుబడికి సంబంధించిన బ్యాంకు ప్రామిసింగ్ పొందడం వల్ల లోన్ ఫైనాన్సింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది.
షరతులు – నిబంధనలు:
పైన తెలిపిన పథకాల్లో నగదు పొదుపు చేసినవారు మెచ్యూరిటీ కాలవ్యవధికి ముందు ఖాతా మూసివేయాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే సాధ్యం అవుతుంది. ఖాతాదారుడు/ జాయింట్ ఖాతాలో వారు ఎవరైనా చనిపోయి ఉండాలి. లేదా ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టు ఆదేశించినప్పుడు మాత్రమే పథకం సంబంధించిన లబ్ధి వర్తిస్తున్నట్లు నిబంధనల్లో అధికారులు తెలుపుతున్నారు. ఇవిలా ఉంటే చిన్న కుటుంబాలకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కూడా చిన్న మొత్తాలలో పొదుపు పథకాలను తీసుకొచ్చింది. వీరికి కూడా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. ప్రస్తుత జనవరి నుంచి మార్చి వరకూ ఉన్న మూడు నెలల కాలవ్యవధికి సంబంధించి సుకన్య సమృద్ధి యోజన 7.6 శాతానికి పెంచినట్లు తెలిపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు కూడా 7.1 శాతం పెరిగింది.