COVID 19: పడగ విప్పుతున్న మహమ్మారి.. ఒకే రోజులో ఎన్ని కేసులు వచ్చాయో తెలుసా..

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 12 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 18 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 07:21 PM IST

COVID 19: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కంట్రోల్‌ లేకుండా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 12 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 38కి చేరింది. ఇక ఏపీలో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో వ్యాప్తి కనిపిస్తోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 18 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు.

Chandrababu Naidu: మూడు నెలల్లో జగన్ ఇంటికే.. విశాఖలోనే 40 వేల కోట్ల కబ్జాలు: చంద్రబాబు

రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఎన్టీఆర్‌ జిల్లా నుంచే నమోదైనట్టు చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒకే రోజులో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఇక దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. కేంద్రం ప్రకటించిన ఈ కొత్త కేసుల లెక్కతో.. భారత్‌లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742కు చేరింది. కేవలం భారత్‌లో మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి స్పీడ్‌ పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

గడిచిన నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 52 శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. మరోవైపు JN.1 వేరియంట్ కలవరపరుస్తోంది. ఈ వేరియంట్‌కి సంబంధించి దేశంలో ఇప్పటి వరకూ 22 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క గోవాలోనే 21 కేసులు వెలుగులోకి రాగా.. కేరళలో ఒక కేసు నమోదైంది. అయితే ఇది ఓమిక్రాన్ ఉప వేరియంట్ అని.. చాలా వరకు సాధారణ లక్షణాలతో ఇంట్లోనే కోలుకుంటారని చెబుతున్నారు. ఐనా ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.