Moon : ఇవాళ చంద్రుడ్ని చూస్తే మంచిదా.. రాజయోగం వచ్చేస్తుందా.. అసలు నిజాలు

ఇవాళ రాత్రి 10 గంటలకు చంద్రున్ని చూస్తే జాతకం మారిపోతోంది. ఎంత దరిద్రంలో ఉన్నవాళ్లకైనా రాజయోగం పట్టేస్తుంది. నిన్నటి నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్‌ ఇది.

 

ఇవాళ రాత్రి 10 గంటలకు చంద్రున్ని చూస్తే జాతకం మారిపోతోంది. ఎంత దరిద్రంలో ఉన్నవాళ్లకైనా రాజయోగం పట్టేస్తుంది. నిన్నటి నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్‌ ఇది. చాలా ఇదే నిజం అనుకుని షేర్లమీద షేర్లు కూడా చేస్తున్నారు. కానీ ఇదంతా ఫేక్‌ ప్రచారం అని చెప్తున్నారు పండితులు. చంద్రున్ని ఎప్పుడు చూసినా ఫలితం మాత్రం ఒకేవిధంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకూ.. అంటే రెండు రోజుల పాటు చంద్రుడు వృచ్ఛికంలోకి వస్తున్నాడు. కుభంలో శని వక్ర దృష్టిలో ఉన్న కారణంగా శని చూపి చంద్రుడి మీద వక్రంగానే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు పండితులు. దీంతో చంద్రుడు తులారాశి నుంచి కుభంలోకి అడుగుపెట్టినా.. చంద్రుడిపై శని చూపు వక్రంగానే ఉంటుందని చెప్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో కొన్ని రాశులవారికి మంచి గఢియలు ప్రారంభమౌతాయే తప్ప.. తలరాతలు మారిపోయే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. ఇలాంటి సమయం 12 వందల ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని.. ఈ సమయంలో చంద్రుడ్ని దర్శించుకోవడం పుణ్యమనే ప్రచారంలో నిజంలేదని చెప్తున్నారు. కన్యారాశి, వృచ్ఛికరాశి, ధనుస్సు రాశి, మకర రాశివాళ్లు ఇవాళ చంద్రుడన్ని చూస్తే మంచి గఢియలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మిగిలిన వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్తున్నారు. ఇలా సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని చెప్తున్నారు.