Owl’s Sound: భయంకరంగా కనిపించే, వినిపించే పక్షుల్లో గుడ్లగూబ ఒకటి. ఈ పక్షిని చాలా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే ఇవి పగలు పడుకుని రాత్రి సమయంలో ఆహారం కోసం వేటాడుతుంటాయి. ఎర చేసే శబ్ధాన్ని విని గుడ్లగూబ దాన్ని పట్టుకుంటుంది. సాధారణంగానే గుడ్లగూబ రూపాన్ని బట్టి చాలా మంది చెడు శకునంగా భావిస్తారు.
చూసేందుకు చాలా భయంకరంగా కనిపించే గుడ్లగూబ ఇంటి ముందు ఏడిస్తే చెడుజరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇక రెండు మూడు రోజులు ఓ ఇంటి ముందు గుడ్లగూబ ఏడిస్తే ఆ ఇంట్లో ఆసాధారణ పరిస్థితులు తలెత్తుతాయాని, చెడు జరుగుతుందనేది చాలా మంది నమ్మకం. కానీ ఇవన్నీ నిజానికి మూఢనమ్మకాలేన. పక్షుల అరుపులు, ఏడుపుల వల్ల పరిస్థితులు మారిపోయే అకాశం ఉండదంటున్నారు నిపుణులు. సాధరాణంగా గుడ్లగూడ ఏడుపు కానీ, అరుపు కానీ కాస్త భయంకరంగా ఉన్న కారణంగా చాలా మంది దాన్ని చెడుగా భావిస్తుంటారని చెప్తున్నారు.
అంతే తప్ప గుడ్లగూబ వల్ల ప్రజలకు, పరిస్థితులకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని చెప్తున్నారు. అలాంటి వాటిని మూఢనమ్మకాలుగానే పరిగణించాలంటున్నారు. మీ ఇంటి ముందు గుడ్లగూబ ఏడ్చినా ఎలాంటి ఆదందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు అంటున్నారు. ఇలాంటి అరుపులు, ఏడుపుల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. కొన్ని దేశాల్లో కొందరు గుడ్లగూబల్ని కూడా పెంచుకుంటారనే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.