ఏలియన్స్ ఉన్నాయా లేవా. చాలా కాలం నుంచి ఇది బిలియన్ డాలర్ క్వశ్చన్. ఏలియన్స్ ఉనికి గురించి చాలా మంది సైంటిస్టులు చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పారు. ఏలియన్స్ ఉన్నాయిని కొందరు నమ్ముతుంటే.. ఖచ్చితంగా ఏలియన్స్ లేవు అనేది కొందరి వాదన. ఇంకొందరైతే ఏలియన్స్ ఆల్రెడీ మనుషులు రూపంలో మన మధ్యే తిరుగుతున్నాయని కూడా చెప్పారు. కానీ ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం.. దీంట్లో దేన్ని నమ్మాలి.. దేన్ని నమ్మకూడదు. ఇదే చాలా మందిలో ఉండే కన్ఫ్యూజన్. వందకు వంద శాతం ఏలియన్స్ ఉన్నాయి.. త్వరలోనే అవి భూమి మీదకు వస్తాయి అని చెప్పకపోయినా.. ఏలియన్స్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయంటూ ఇస్రో చీఫ్ సోమనాథ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఏలియన్స్ గురించి సోమనాథ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏలియన్స్ ఉన్నాయని మీరు నమ్ముతారా అన్న ప్రశ్నకు ఒక్క సెకన్ కూడా గ్యాప్ తీసుకోకుండా ఉన్నాయనే నమ్ముతానంటూ చెప్పారు. ఈ భూమి మీద మనం ఉన్నట్టే విశ్వంలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉండే అవకాశం ఉందన్నారు. ఏదోఒకరోజు ఏలియన్స్ భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని.. లేదంటే ఇప్పటికే అప్పుడప్పడు భూమీ మీదకు వచ్చి వెళ్తూ ఉండే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పిన మాట ఇప్పడు చాలా మందిలో ఇంట్రెస్ట్‌ను పెంచింది. ప్రస్తుతం మనం చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్లబోతున్నాం. ఏలియన్స్ మనకంటే వెయ్యేళ్లు టెక్నాలజీలో ముందుండే ఛాన్స్ ఉంది.. లేదంటే 2 వందల ఏళ్లు వెనకే ఉండే ఛాన్స్ ఉంది.. మనం మాట్లాడుకునే ప్రతీ మాటను ఏలియన్స్ వినే అవకాశం కూడా ఉంది అని సోమనాథ్ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏలియన్స్ ఉనికి గురించి చాలా కాలం నుంచి చాలా రూమర్స్ ఉన్నాయి. ఏలియన్స్‌ను చూశామని కూడా కొందరు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. అమెరికాలోని ఏరియా 51లో సైంటిస్ట్‌లు ఏలియన్స్‌తో కలిసే ప్రయోగాలు చేస్తున్నారు అనే ఓ వాదన కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నాయి అని వాదించినవాళ్లు ఇప్పటి వరకూ పెద్దగా లేరు. కొందరు అప్పుడప్పుడూ కొన్ని ఆధారలతో ముందుకు వచ్చినా.. ఏలియన్స్ ఉన్నాయి.. అవి భూమి మీదకు వచ్చాయి అనే వాదనకు పెద్ద బలాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఇస్రో చీఫ్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా నిర్మొహమాటంగా ఏలియన్స్ ఉనికిని నమ్ముతానని చెప్పారంటే ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయని త్వరలోనే అవి మనుషులను కలుస్తాయనే నమ్ముతున్నారు చాలా మంది.