ISRO: ఇస్రోపై విదేశాల సైబర్‌ ఎటాక్స్‌.. దిమ్మతిరిగే వార్నింగ్‌ ఇచ్చిన సోమనాథ్‌..

ఇస్రో కేంద్రంపై రోజూ వందల సంఖ్యలో సైబర్‌ ఎటాక్స్‌ జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతమైన తరువాత ఈ ఎటాక్స్‌ ఇంకా పెరిగాయట. ఏదో ఒకలా ఇస్రో డేటాబేస్‌ను హ్యాక్‌ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 04:44 PM IST

ISRO: ప్రపంచంలో ప్రతీ దేశం చూపు ఇప్పుడు మన ఇస్రో మీదే ఉంది. చంద్రయాన్‌-3 మిషన్‌తో ఏ దేశం సాధించలేని ఘనతను సాధించింది ఇండియా. చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకూ ఏ దేశం దగ్గర లేని ఇన్ఫర్మేషన్‌ ఇప్పుడు భారత్‌ దగ్గర ఉంది. అదంతా ఇస్రో సెంటర్‌లో సేవ్‌ చేసి ఉంది. దీంతో ఇస్రోను టార్గెట్ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఇస్రో దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ను హ్యాక్‌ చేయగల్గితే వందల కోట్లు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అదే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇస్రో కేంద్రంపై రోజూ వందల సంఖ్యలో సైబర్‌ ఎటాక్స్‌ జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతమైన తరువాత ఈ ఎటాక్స్‌ ఇంకా పెరిగాయట. ఏదో ఒకలా ఇస్రో డేటాబేస్‌ను హ్యాక్‌ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. కేవలం మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సైబర్‌ ఎటాక్స్‌ భారీగా జరుగుతున్నట్టు చెప్పారు సోమనాథ్‌. అయితే ఈ పరిస్థితిని, ప్రమాదాన్ని ముందే ఊహించామన్నారు. అందుకే ఇస్రోకు బలమైన సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేశామని చెప్పారు. రోజుకు వంద కాదు.. వెయ్యిసార్లు ప్రయత్నించినా ఇస్రో డేటా బేస్‌ను ఎవరూ హ్యాక్‌ చేయలేరంటూ చెప్పారు. ఇక విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ రెండు మాడ్యూల్స్‌ ఇక తిరిగి పనిచేసే చాన్స్‌ లేదని చెప్పారు. ఇప్పటికే చంద్రుడి సౌత్‌పోల్‌లో వెలుతురు వచ్చి.. అది వెళ్లిపోయే టైం కూడా వచ్చేసింది. ఒకవేళ విక్రమ్‌, ప్రగ్యాన్‌ పని చేసేలా ఉంటే ఇప్పటికే అవి మరోసారి సిగ్రల్స్‌ పంపి ఉండాలి. ఇన్ని రోజులు కావొస్తున్నా ఇంకా ఎలాంటి రెస్పాన్స్‌ లేదు అంటే ఇక వాటి అధ్యాయం ముగిసినట్టే అని చెప్పారు.