Aditya L1: ఆదిత్య ఎల్ 1 చేపట్టే ప్రయోగాలు ఇవే..?

చంద్రయాన్ విజయాన్ని మరో ప్రయోగంతో పంచుకోనుంది ఇస్రో. అదే ఆదిత్య ఎల్-1.

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 07:16 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ -3 ప్రయోగం సక్సెస్ తరువాత మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా ఈ సారి సూర్యుడిని ఎన్నుకుంది. ఈ ప్రయోగాన్ని గత కొన్నేళ్ళ క్రితమే చేపట్టినప్పటికీ ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. మరో వారం రోజుల్లో సూర్యుని పైకి ఆదిత్య ఎల్ 1 ను పంపించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇందులోని సాంకేతికత మొత్తం మనదేశానిదే కావడం విశేషం. ఇది విజయవంతం అయితే భారత్ శాస్త్ర, సాంకేతిక రంగంలో మరో మైలురాయిని అధిరోహించడం ఖాయం. దీనిని అంతరిక్షంలోకి పంపించడం కోసం బెంగళూరు, పూణె లోని ఆస్ట్రోఫిజిక్స్ యూనివర్సిటీలు తీవ్రంగా శ్రమించాయి. ఈ రాకెట్ కి ఏడు రకాలా పేలోడ్స్ ను అనుసంధానం చేసి గగనతలం లోకి పంపిస్తారు. ఇప్పటికే శ్రీహరి కోట స్పేస్ సెంటర్లోకి ఇవి బెంగళూరు నుంచి సురక్షితంగా చేరుకున్నాయి.

వీటి మీదే ప్రయోగాలు

భారత్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే మిషన్ ఆదిత్య ద్వారా చాలా ప్రయోజనాలు కలుగనున్నాయి. ముందుగా సూర్యుని గురించి పూర్తి విషయాలను తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటూ సౌర తుఫానులు, సౌరవ్యవస్థపై అవగాహనతో పాటూ ఒక నిఘాను ఏర్పాటు చేయడం కోసం దీనిని ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే లాంగ్రేజ్ పాయింట్ వద్ద ఉండే కక్షలోకి ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది.  అలాగే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ తోపాటూ సూర్యడి లోపల ఉన్న పొరలను క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది.

T.V.SRIKAR