America: అసలు ఎవరీ జాక్‌ టిషేరా ? అమెరికా సైనిక రహస్యాలు ఎలా లీక్‌ చేశాడు..?

ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ కంట్రీ ఏది అంటే దాదాపు అంతా చెప్పే పేరు అమెరికా. చాలా స్ట్రాంగ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వాళ్ల సొంతం. వాళ్ల స్పై సిస్టమ్‌, డిఫెన్స్‌ స్ట్రాటజీస్‌ని చాలా సీక్రెట్‌గా మెయిన్‌టేన్‌ చేస్తుంటారు. అందుకే వాళ్లకు అగ్రదేశం అన్న పేరు. కానీ.. జాక్‌ టిషేరా అనే 21 ఏళ్ల యంగ్‌ బాయ్‌ ఆ దేశం సీక్రెట్స్‌ మొత్తం లీక్‌ చేశాడు. డిఫెన్స్‌ సిస్టమ్‌తో పాటు, ఎటాకింగ్‌ స్ట్రాటజీస్‌, మిత్రదేశాల్లో అమెరికా మెయిన్‌టేన్‌ చేస్తున్న గూఢచారులు, యుక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా తీసుకోబోయే చర్యలు.

  • Written By:
  • Updated On - April 15, 2023 / 03:40 PM IST

ఇలా అన్నిటినీ తన ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ గ్రూప్‌లో షేర్‌ చేశాడు. ఇలాంటి లీక్‌ అమెరికాలో జరిగి దాదాపు 10 ఏళ్లు గడిచింది. పెంటగాన్‌లో చాలా తక్కువ మందికి మాత్రమే యాక్సెస్‌ ఉండే ఆ ప్రాంతం నుంచి డేటా లీక్‌ అయ్యిందని తెలియడంతో అమెరికా షేక్‌ అయ్యింది. డేటా లీక్‌ చేసిన యువకున్ని అరెస్ట్‌ చేసింది. మస్సాచుసిట్స్‌లోని జాక్‌ టిషేరా ఇంటిని హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంక్‌లతో ముట్టడించింది. యువకుణ్ణి అరెస్ట్‌ చేసి బోస్టన్‌లోని కోర్టులో హాజరుపర్చింది. 21 ఏళ్ల జాక్‌.. మసాచుసెట్స్‌ 102 ఎయిర్‌ నేషనల్‌ గార్డ్‌ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

2019లో జాక్‌ సర్వీసులో చేరాడు. వెస్ట్‌ కేప్‌కోడ్‌లోని ఒటిస్‌ నేషనల్‌ ఎయిర్‌గార్డ్స్‌ ఆఫీస్‌లో.. సైబర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌ జర్నీమన్‌గా డ్యూటీ చేస్తున్నాడు. నిజానికి అది చాలా చిన్న హోదా. కానీ జాక్‌ పనిచేసే ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అత్యంత కీలకమైంది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ దాడులకు ముందు డ్రోన్ల ద్వారా సమాచార సేకరణ ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇరాక్‌, సిరియా లాంటి చోట్ల అమెరిన్‌ ట్రూప్స్‌కు అవసరమైన సహాయక కార్యక్రమాలను ఈ విభాగం ఆపరేట్‌ చేస్తుంటుంది. అమెరికా సైన్యంలో అత్యంత రహస్య ఆపరేషన్లకు వెళ్లే బృందాలకు కూడా ఈ టీం బ్యాక్‌బోన్‌గా ఉంటుంది.

దీంతోపాటు నాటోలో ఉన్న జనరల్స్‌, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికన్‌ బ్యూరోక్రాట్లకు అవసరమైన సపోర్ట్‌ ఇక్కడి నుంచి వెళ్తుంది. దీంతో ఇక్కడ పనిచేసేవారికి అమెరికాలోని అత్యంత రహస్య పత్రాలను చూసే అవకాశం ఉంటుంది. జాక్‌కు కూడా ఇలానే యాక్సెస్‌ లభించింది. నిజానికి ఇలాంటి స్థానంలో ఉండే వ్యక్తికి కావాల్సిన అర్హతలు చూస్తే షాకవ్వాల్సిందే. జస్ట్‌.. ఏదైనా హైస్కూల్‌ డిగ్రీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఈ డిపార్ట్‌మెంట్‌లో 18 నెలల ట్రైనింగ్‌. ఇవి మూడు ఉంటే చాలు. ఉద్యోగం ఇచ్చేస్తారు. ఇంత కాన్ఫిడెన్షియల్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే వ్యక్తులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్‌ ఇదేనా.. ఇప్పుడు అమెరికాను ప్రతీ ఒక్కరూ ఇదే క్వశ్చన్‌ చేస్తున్నారు.

అయితే నిజానికి దీని వెనక కుట్ర కోణం ఏమీ లేదు. జాక్‌ ఏ దేషానికి గూఢచారి కాదు. ఉగ్రవాదులతో సంబంధాలు లేవు. ఇదొక్కటే ఇప్పుడు అమెరికాను ఊపిరిపీల్చుకునేలా చేసిన అంశం. తన ఫ్రెండ్స్‌ ముందు తన రేంజ్‌ ఏంటో ప్రూవ్‌ చేసుకునేందుకు జాక్‌ పని చేసినట్టు అధికారిలు ఐడెంటిఫై చేశారు. జాక్‌ ఫ్రెండ్స్‌ చాటింగ్‌ గ్రూప్‌ దాటి ఈ డాక్యుమెంట్స్‌ ఎక్కవడికీ వెళ్లలేదని చెప్తున్నారు. కుట్ర కోణం లేకపోవచ్చు.. కానీ ఇక్కడ జరిగిన లీక్‌ మాత్రం మామూలుది కాదు. జాక్‌ లీక్‌ చేసిన డాక్యుమెంట్స్‌ ఉగ్రవాదుల చేతికి వెళ్తే.. దాని రిజల్ట్‌ ఊహించని విధంగా ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి జాక్‌ను జైలుకు పంపించింది అమెరికా గవర్నమెంట్‌.