MLA Muthireddy Daughter: ఎమ్మెల్యేకు పంచ్ ఇచ్చిన కూతురు.. తండ్రి కబ్జా చేసిన భూమిని ఇచ్చేస్తాన్న ముత్తిరెడ్డి కూతురు భవాని

సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని ఎమ్మెల్యు ముత్తిరెడ్డి కబ్జా చేసి తన కూతురు భవాని పేరు మీద రాశారు. ఈ భూమి దాదాపు 1,200 గజాలకుపైగా ఉంటుంది. ఈ భూమి మొత్తాన్ని తిరిగి చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తామని భవానీ ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 04:33 PM IST

MLA Muthireddy Daughter: ఎమ్మెల్యేలుసహా అధికార నేతలు భూములు కబ్జా చేయడం సాధారణమే. ఇలా కబ్జా చేసిన భూమిని తమ పిల్లలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు. తర్వాత వాటిని వాళ్లు అనుభవిస్తుంటారు. అయితే, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎమ్మెల్యే అయిన తన తండ్రి కబ్జా చేసి, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి అప్పగించేందుకు ముందుకొచ్చింది.
సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని ఎమ్మెల్యు ముత్తిరెడ్డి కబ్జా చేసి తన కూతురు భవాని పేరు మీద రాశారు. ఈ భూమి దాదాపు 1,200 గజాలకుపైగా ఉంటుంది. ఈ భూమి మొత్తాన్ని తిరిగి చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తామని భవానీ ప్రకటించారు. కోర్టు ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేస్తానన్నారు. ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్న భవాని.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. తన పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి ప్రజలకు అప్పగిస్తాన్నారు. అంతేకాదు.. ఈ భూమి చుట్టూ నిర్మించిన ప్రహరీని ఆమె స్థానికులతో కలిసి కూల్చేశారు. గ్రామానికి చెందిన స్థలాన్ని తండ్రి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినందుకు క్షమించాలని ఆమె ప్రజలను కోరారు.

క్షమాపణలు కోరుతూ ఆ స్థలం వద్ద ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందిరాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రికి 70 ఏళ్లు వచ్చినట్లు, రెండు సార్లు ఎమ్మెల్యే అయినట్లు భవాని చెప్పారు. ఎమ్మెల్యే కాకముందే ఆయనకు రూ.వెయ్యి కోట్ల ఆస్తి ఉందని.. అలాంటిది ఈ భూ ఆక్రమణకు పాల్పడకుండా ఉండాల్సిందని భవాని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా తన తండ్రిపై భవాని అనేక ఆరోపణలు చేశారు. ఈ భూ కబ్జా, రిజిస్ట్రేషన్‌పై తండ్రిని బహిరంగంగానే నిలదీశారు. గతంలో కూడా తండ్రిపై భవాని అనేక ఆరోపణలు చేశారు.

ఈ అంశంపై గతంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ తన విషయంలో ప్రత్యర్థులు కుట్రపన్నారని, అందుకే తన కూతురు ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రస్తుతం ముత్తిరెడ్డి-భవాని అంశం చర్చనీయాంశంగా మారింది. తండ్రి అక్రమంగా సంపాదించిన ఆస్తిని తిరిగిచ్చేసిన భవానీని అందరూ అభినందిస్తున్నారు.