Kissing Divice: ముద్దులాడే ముచ్చటైన పరికరం వచ్చేసిందోచ్..!

ఈమధ్య కాలంలో లివింగ్ రిలేషన్స్ క్రమక్రమంగా పెరిగిపోయాయి. ఒకరితో ఒకరు ఒకరికొకరు అనే బలమైన నినాదంతో కలిసి మెలిసి జీవనాన్ని సాగిస్తున్నారు. వీరిసంగతి ఇలా ఉంటే దూరంగా ఉండి రిలేషన్లో ఉండే వారి పరిస్థితి ఏంటి. వీరికంటూ ఒక ముద్దు ముచ్చట ఉండాలి కదా. అదేదో సినిమాలో మనిషి అన్నాక కూసింత కళా పోషణ ఉండాలి అని రావుగోపాల్ రావు అన్నట్లు. మనిషి అన్నాక కాస్త రొమాంటిక్ ఆలోచనలు ఉండాలి. అది వయసును బట్టి సర్వసాధారణం. మన శరీరంలోని హార్మోన్స్ ప్రభావం వల్ల ఇలా రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి. అందుకే ఈ కిస్సింగ్ పరికరాన్ని కనుగొన్నారు. వినడానికి ఆసక్తికరంగానూ చెప్పేందుకు కొంచం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇది నిజం.

  • Written By:
  • Updated On - February 27, 2023 / 04:57 PM IST

ఈ కిస్సింగ్ పరికరం ఎక్కడ కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు. ఎలా పనిచేస్తుంది. అనే మరిన్ని అసాధారణమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టు పక్కల పరిసరాల్లోనో లేదా ఆన్లైన్ లో ఒకరిని ఒకరు ఇష్టపడే సంఘటనలను సమాజంలో తరచూ చూస్తూనే ఉంటాం. సమాజంలోని ఏమార్పు అయినా రుగ్మతలనుండో, అలవాట్ల నుంచో, వ్యక్తుల ఆలోచనల నుంచో బయటకు వస్తాయి. వాటిని పరిస్థితులకు అనుగుణంగా పరికరాల రూపంలో కొన్ని వస్తు సేవలను తయారు చేస్తారు. ఇలా వచ్చిందే ఈ కిస్సింగ్ పరికరం.

జియాంగ్ జోంగ్లీ కథ:

ఈ కిస్సింగ్ పరికరాన్ని లాంగ్ రిలేషన్ షిప్ (Long Distance Relationship)లో ఉన్న ప్రేమికులు, ఒకరిని ఒకరు ఇష్టపడేవారు, సొంతంగా బంధుత్వాన్ని కలిగి ఉండే ఎవరైనా ఉపయోగించవచ్చు. అది వారివారి బంధం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రేయసి ప్రియులు, దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరిని వీడి ఒకరు గడపవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం వృత్తి, సంపాదన, కుటుంబపోషణ, ఆర్ధిక పరిస్థితులు ఇలా చెప్పుకుంటూ పోతే వీటి కారణాల చిట్టా పెళ్లి పట్టీని దాటిపోతుంది. ఇలా దూరంగా గడిపే వారికోసం దీనిని తయారు చేశారు. దీని రూపొందించడానికి వెనుక ఒక కథ ఉంది. ప్రేమలో ఉన్న జియాంగ్ జోంగ్లీ (Jiang Zhongli) అనే చైనీయుడు ప్రియురాలి నుంచి రొమాన్స్ కోరుకున్నాడు. అది భౌతికంగా సాధ్యపడలేదు. అందుకే విరహలోలుడైన ఇతగాడు ముద్దులాడే కిస్సింగ్ డివైజ్‍ను కనుగొన్నాడు. వర్చువల్ గా రొమాన్స్ చేసుకునేలా దీనిని తయారు చేశాడు.

kissing device in china

కిస్సింగ్ డివైజ్ పనితీరు:

ఇక దీని పనితీరు విషయానికొస్తే.. దీనికి సిలికాన్ తో తయారు చేసిన సున్నాతమైన పెదాలను కలిగి ఉంటుంది. ఇందులో పెదాల కదలికలను, ముద్దు పెట్టేటప్పుడు వచ్చే వెచ్చని గాలులను కూడా మనకు కావల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చట. దీనికోసం ప్రత్యేకంగా ప్రెజర్ (Pressure) సెన్సార్లతో పాటూ యాక్యూరేటర్లు (Actuators) ఏర్పాటు చేశారు. రియల్ గా కిస్ చేసిన అనుభూతిని ఈపరికరం అందిస్తుంది. చైనాలోని చంగ్జౌ (Changzhou) ప్రాంతంలో ఓ యూనివర్సిటీ ఈ డివైజ్‍ను కనుగొన్నట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. దీనిని ముందుగా వాడాలనుకునే వారు స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఆతరువాల ఛార్జింగ్ కేబుల్ ద్వారా కిస్సింగ్ డివైజ్ ను ఫోన్ కు అనుసంధానం చేయాలి. ఆతరువాత ముద్దులాడాలనుకునే ఇరువురు వీడియో కాల్ చేసుకొని పరికరానికి ఉన్న సిలికాన్ పెదాలకు ముద్దు పెట్టి మనం ఎంచుకున్న పార్ట్ నర్ డివైజ్ కు కిస్ లను పంవచ్చు. అలా పంపిన వెంటనే కాల్ లో అటువైపు ఉన్న వ్యక్తికి కిస్సింగ్ మోషన్ తో పాటూ, ముద్దులాడిన ధ్వనిని కూడా ఈ మిషన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా తమ విరహాన్ని ఆర్టిఫీషియల్గా తీర్చుకోవచ్చు.

ఈ డివైజ్ పై ఔత్సాహికులు ప్రశంశలు గుప్పిస్తుంటే కొందరు ఆశ్చర్యానికి గురౌతున్నారు. అలాగే ఈ సరికొత్త కిస్సింగ్ పరికరం అసభ్యకరం అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నపిల్లలకు ఇది అలవాటు అయితే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

T.V.SRIKAR